2.5 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

జిల్లా పోలీస్ బాస్ కీలక ఆదేశాలు జారీ

అనకాపల్లి: రానున్న ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సిబ్బందికి సూచించారు.కార్యాలయంలో ఎస్పీ జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ 1వ తేదీ నుంచి ఎగ్జిట్ పోల్స్, 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న సందర్భంగా, తదుపరి రోజుల్లో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.ర్యాలీలు, ఊరేగింపులు, పండుగలలో స్టేజ్ ప్రోగ్రాములకు అనుమతులు లేవని, పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు అనుమతించకూడదని, బాణసంచా తయారీ దుకాణాలను తనిఖీ చేయాలని, వాటి అమ్మకాలపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు.రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా నుంచి బహిష్కరించడం జరుగుతుంది.గ్రామాల్లో దాబాలు, హోటల్లు, పాన్ షాప్ లలో అక్రమ మద్యం లభ్యం కాకుండా మరియు జూదం కోడిపందాలు కాయిన్ గేమ్, బెట్టింగ్ మొదలైన చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్రామాల్లో పోలీసు పికెట్, పెట్రోలింగ్ మరియు చెక్ పోస్ట్‌లను ప్రణాళికతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించేవారు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని గుర్తించి, వారి కట్టడి కి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.

ఎస్.హెచ్.ఒ / ఇన్‌స్పెక్టర్లు గ్రామ స్థాయి లోని వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సెక్షన్ 144CrPC, 30 పోలీస్ యాక్ట్, బౌండ్ డౌన్ గురించి వివరించి, చట్టాలను ఉల్లంఘించిన ఎడల ఉల్లంఘన (బాండ్ల జప్తు), వాటి పరిణామాలు, చట్టపరంగా తీసుకునే కఠిన చర్యల గురించి వివరించాలని పోలీస్ అధికారులకు తెలియజేశారు.

ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు మరియు నిరాధార ఆరోపణలు మొదలైన వాటిని సామాజిక మాధ్యమాల వేదికపై ప్రచారం చేయకూడదని అలా చేసిన ఎడల కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం జరిగింది.అనుమతి లేని ర్యాలీలు, ఊరేగింపులు ,సమావేశాలు, బాణసంచా పేల్చడం నిషేధం అని, అలాంటివి ప్రోత్సహించి, నిర్వహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు

2014 & 2019, సాధారణ ఎన్నికలు మరియు 2021 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్ మరియు ఇతర రికార్డులలో మునుపటి ఎన్నికల నేరాలు మరియు నిందితులను గుర్తించి, వారి ప్రస్తుత కార్యకలాపాలను నిఘా ఉంచి అటువంటి వారి పై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు నిర్వహించడం మరియు పాల్గొనడం నేరం. అటువంటి వారిపై నిఘా ఉంచడమే కాక చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు వారి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తమ తమ అధికార పరిధిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని, తమ పరిధిలోని లాడ్జీలు, చౌల్ట్రీలు మరియు కల్యాణ మండపం మొదలైన చోట అపరిచిత వ్యక్తులు మరియు అనుమానిత వ్యక్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని,
గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ లు మరియు అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ లు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు  బి.విజయ భాస్కర్, పి. సత్యనారాయణ రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.అప్పలరాజు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ కె.వి.సత్యనారాయణ, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ  జి.ఆర్.ఆర్.మోహన్, డిటిసి డీఎస్పీ  డి.రామ వర్మ, దిశా డీఎస్పీ  ఎం.ఉపేంద్ర బాబు, ట్రైనీ డీఎస్పీ శ్రీమతి భవ్య, ఇనస్పెక్టర్ లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు మరియు కుమారస్వామి, గణేష్, సతీష్ , మన్మధరావు, ఎస్సైలు రామారావు, రఘువర్మ, మరియు జిల్లా సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles