3.1 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

నిజమైన నాయకుడు మన జె డి

విశాఖపట్నం:ప్రజలకు కష్టం వస్తే తమ కష్టంగా భావించి అండగా నిలబడే వారే నిజమైన నాయకులుగా భావిస్తుంటారు. అటువంటి నాయకులకు నిదర్శనంగా నిలుస్తున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ , జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ.నాయకుడంటే ప్రజలను పాలించేవాడు కాదు.. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి ఆపదలో ఆడుకునే వాడే అసలు సిసలు నాయకుడు. ఇందుకు మంచి ఉదాహరణ జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సపర్యలు చేసి ప్రజల మన్ననలు పొందారు.ఇక వివరాల్లోకి వెళితే… విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయానికి వెళుతున్న జేడీ లక్ష్మీనారాయణ ఊర్వశి జంక్షన్ వద్ద, యాక్సిడెంట్ అయిన గుర్తు తెలియని వ్యక్తిని చూసి ఆయన చలించిపోయారు.వెంటనే మార్గమధ్యలో కారును ఆపి గాయాలతో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి సాధారణ వ్యక్తిగా నెలపై కూర్చొని సపర్యలు చేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. . దీంతో అక్కడున్న స్థానికులు నాయకుడంటే జేడీ లక్ష్మీనారాయణలా ఉండాలని కొనియాడారు. మానవత్వం పరిమళించిన మంచి వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ అనే భావన స్థానికులలో కలిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles