అనకాపల్లి:బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ,టీడీపీ,జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశానికి బీజేపీ ఎంపి ఉమ్మడి అభ్యర్ధి సీఎం రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6 వ తేదీ సోమవారం జరుగనున్న ప్రధాని నరేంద్ర మోడీగారి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.కష్టబడి పనిచేస్తే విజయం తధ్యం అన్నారు.కూటమి అభ్యర్ధుల గెలుపు కు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు. ఎన్డీయే గెలుపు తో కేంద్రంలో నరేంద్ర మోదీ మరొక్క సారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి
అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో శాసనసభా స్థానాలకు పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులకు వారి పార్టీ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ,మాజీ ఎమ్మెల్సీలు నాగ జగదీష్, పివియన్ మాధవ్, దాడి రత్నాకర్ ,రిత్విక్ ,సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.