అనకాపల్లి: నియోజకవర్గ అసెంబ్లీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మనసాల భరత్ కుమార్ స్థానిక జీవీఎంసీ 83 వ వార్డు కార్పొరేటర్ జాజుల రమేష్ ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక వేల్పులవీధిలో ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది.. ముందుగా వేల్పుల వీధి, శ్రీ గౌరీ పరమేశ్వరులను, దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేల్పులవీధిలో పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు ఉగ్గిన అప్పారావు ఆధ్వర్యంలో 60 మంది మహిళలకు భరత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారుల్లోకి వస్తే ఈ ప్రాంతంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. అనకాపల్లి లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదవారికి గృహాలు మంజూరు చేశారని, ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా మహిళలకు అందించారని భరత్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు భీశెట్టి వెంకట సత్యవతి, ఉగ్గిన అప్పారావు, బోండా శంకర్రావు, గొర్లి చిన్న, జెట్టిశ్రీను, మద్దాల చలపతి, కొంకి శ్రీరామ్ మూర్తి, బొండా వాసు, మద్దాల రమణ ” బాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.