3.2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

సారాయి వ్యాపారులను కాదు.. సేవా చేసే వారిని ఎన్నుకుందాం

అనకాపల్లి,రొలుగుంట:ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేత సీఎం జగన్ మోహన్ రెడ్డి అని,  అన్ని వయసుల వారికి అన్నీ విధాల అదుకున్న ప్రభుత్వం తమదని ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. నియోజకవర్గంలో మౌళిక సదుపాయాలు నిమిత్తం ధర్మ శ్రీ చేసిన కృషిని మండలంలోని రత్నం పేట లో ఏర్పాటు చేసిన ఎన్నికలు ప్రచారం కార్యక్రమంలో కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ…గత ప్రభుత్వంలో పాడైన రోడ్లలో గంపెడు మట్టి కూడా వేయలేదని గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు వంటివన్నీ వైసిపి ప్రభుత్వంలోనే ఏర్పాటు చేశామని, నిబద్ధతతో ఆనేక సంక్షేమ పథకాలు అందించామని జగనన్న సంక్షేమ ఫలాలు అందాయి అంటే కేవలం సీఎం జగన్ వల్లే సాధ్యమైందని, ఇక ముందు కూడా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం జగన్ మళ్ళీ సిఎం కావాలని అందకు ప్రతి ఒక్కరు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సారాయి వ్యాపారం చేసుకుంటూ, ప్రజా ధనాన్ని లూటీ చేసి ఎక్కడినుండో వచ్చిన సిఎం రమేష్ కు తగిన బుద్ధి చెప్పాలని, సేవా చేసి ఎదిగి, అందరికి అందుబాటులో ఉంటున్న స్థానిక ముత్యాలనాయుడు , ధర్మా శ్రీ ని ఎన్నుకుందమాని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ పిలుపునిచ్చారు.సారాయి వ్యాపారులను కాదు.. సేవా చేసే వారిని ఎన్నుకుందాం అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles