అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఇప్పటివరకు 17 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మరో 50 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి భవనం కూలిపోగా దాని శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నేడు అచ్యుతాపురం సెజ్‌లో చంద్రబాబు పర్యటన


ఇక ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేటే లిమిటెడ్‌లో జరిగిన ఈ ప్రమాద తీవ్రత చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే వాదన వ్యక్తం అవుతోంది. ఈ కంపెనీలో వందలాది మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
అయితే కంపెనీలో లంచ్ బ్రేక్‌లో ఈ భారీ పేలుడు సంభవించడంతో మరింత ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్లు అయిందని ఫ్యాక్టరీ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే రియాక్టర్ పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని
ఇక పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడి ఛిద్రమైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు రియాక్టర్ పేలుడు కారణంగా వచ్చిన శబ్దంతో ఆ కంపెనీలో ఉన్న కార్మికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బయటికి పరుగులు తీసినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు.
ఇక ఈ భారీ శబ్దానికి పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 11 ఫైర్ ఇంజిన్‌లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి.
ఇక గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు.
మంటలు అంటుకుని కాలిన గాయాలతో ఏడుగురు మృత్యువాత పడగా మొదటి అంతస్తు కుప్పకూలడంతో శ్లాబు కింద చిక్కుకుని మరో ఏడుగురు చనిపోయారు. ఇక శిథిలాల కింద మరికొందరు ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక మరో 50 మందికి పైగా గాయపడగా వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి.


అచ్యుతాపురం సెజ్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇక గురువారం సంఘటనా స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. రియాక్టర్‌ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ తెలిపారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. సంఘటనా స్థలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని మృతుల వివరాలు తెలిసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు.


అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలోని M/s Escientia Advanced Sciences PVT Ltd, AP SEZ లో జరిగిన ప్రమాద సంఘటన స్థలిని పరిశీలించిన రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మరియు అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ

ఆసుపత్రిలో పలువురు బాధితులను పరామర్శిస్తున్న నేతలు

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

4 వారాలు ago

వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా…

1 నెల ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

4 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

4 నెలలు ago

అస్వ‌స్థ‌త‌కు గురైన‌ పిల్ల‌ల‌కు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ విజయ క్రిష్ణన్అనకాపల్లి ఆగ‌స్టు 19 : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప‌ట్నం అనాథాశ్రమంలో…

5 నెలలు ago