పాయకరావుపేట: శాసనసభ నియోజకవర్గ
ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత సోమవారం భారీ ఎత్తున అభిమానగణం తో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి బిజెపి అభ్యర్థి సిఎం రమేష్ మాట్లాడుతూ టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ అయిన వంగలపూడి అనిత విజయం తధ్యమని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అన్యాయాలను,అక్రమాలను ఎప్పటికప్పుడు ధైర్యంగా ప్రజలకు వివరించడంలోనూ,టీడీపీ నాయకులు,కార్యకర్తలకు అండగా వుండటంలోనూ అనిత ఎప్పుడూ ముందుంటారని కితాబునిచ్చారు.టీడీపీ మహిళాశక్తికి ఆమె ప్రతీకగా ఉంటారని అన్నారు.ఇటువంటి నాయకురాలు విజయం సాధిస్తే నియోజకవర్గానికి మేలుచేస్తారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ఆయన హామీఇచ్చారు. అనితకు మద్దతుగా టీడీపీ,బీజేపీ,జనసేన నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో రావడమే ఆమె విజయానికి సంకేతమని పేర్కొన్నారు.కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.