అనకాపల్లి:రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు రాజ్యాధికారం, సమ సమాజ స్థాపన లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ( టి బి కే జేఏసీ) రాష్ట్ర అధ్యక్షులు దాసరి రాము పేర్కొన్నారు. సోమవారం స్థానిక విజయ రెసిడన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ కడప, రాయలసీమ సాంప్రదాయలైన నామినేషన్ వేసిన వారిని కొట్టడం, నామినేషన్ వేయకుండా బెదిరించడం వంటి దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇసుక ద్వారా 20 వర్గాలకు చెందిన ప్రజలు బతుకుతున్నారని అటువంటి ఇసుక హైదరాబాద్ చెన్నై ప్రాంతాలకు తరలిపోతుందని అక్కడ మంచి ధర పలుకుతుంది అన్నారు. రాష్ట్రంలో మాత్రం ఇసుక దొరకని పరిస్థితి ఉందన్నారు . అప్పులు తెచ్చి పరిపాలన సాగిస్తున్నారని అప్పు లేకుండా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పలేరని అన్నారు. నకిలీ మద్యం తయారుచేసి సామాన్యుల ప్రాణాలతో చలగాటం మాడుతున్నారన్నారు. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ లావాదేవీలు లేవన్నారు. నాసిరకం మందు అమ్మడం ద్వారా సామాన్యుల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉన్నా ఎవ్వరు ప్రశ్నించకపోవడం వలన రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అభివృద్ధి లేదని పాలన అంతా అవినీతి మయంగా ఉందని అన్నారు. మార్పు కోసం జనసేన ఎంఎల్ఏ అభ్యర్ధి కొణతాల రామకృష్ణ, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి దూలం గోపి, శ్రీరామదాసు గోవింద, కొణతాల రత్న కుమారి తదితరులు మాట్లాడారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…