అభ్యంతరాలన్నీ పరిశీలిస్తాం-జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి

అనకాపల్లి: రాజకీయ పార్టీల నుండి వచ్చిన అభ్యంతరాలన్ని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభ్యంతరాలను ఆధారపూర్వకంగా సమర్పించాలన్నారు. మార్చి 16వ తేదీ వరకు వున్న సప్లిమెంటరీ ఓటర్ల జాబితా ఏప్రిల్ 25వ తేదీన అందజేస్తామన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ, 29వతేదీ వరకు ఉప సంహరణ వుంటుందని వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఈవీఎం లపై కమిషనింగ్ వుంటుందన్నారు. తరువాత ఎవీఎంల రాండమైజేషన్ జరుగుతుందన్నారు. వీటికి అన్ని పార్టీలు వారి ఏజెంట్లను పంపిచాలన్నారు. పార్లమెంట్ ఏఆర్ఓఐన జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల సౌకర్యకేంద్రం నిర్వహించబడుతుందన్నారు. *వోటర్ గైడ్* అనే కరపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని, దానిలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోఓటరుగా నమోదవడం, దివ్యాంగులకు, 85 సం.లు దాటినవారికి వోటువేసేందుకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఎన్నికలు, పార్టీలు, ఓటింగ్ చేయడం పై పూర్తి అవగాహన వుంటుందని వివరించారు. నామినేషన్లకు ముందు ఇంటింటి ప్రచారానికి ఎటువంటి ఆంక్షలు లేవని, శాంతి భద్రతల దృష్ఠ్యా స్టేషన్ హౌస్ అధికారికి సమాచారం ఇవ్వాలని, ఎన్నికల నిబంధనలకు తప్పక పాటించ వలసి వుంటుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ బి.దయానిధి, డి.యం.అండ్ హెచ్ వో డాక్టర్ ఏ హేమంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, డి.టి. రవి కుమార్, వివిధ పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్సీ బి.నాగ జగదీశ్వరరావు (తెలుగుదేశం), ఎంపీపీ గొర్లె సూరిబాబు (వై.సి.పి), డి.పరమేశ్వరరావు (బిజెపి), అల్లు రాజు (సిపియం), డి.సంతోష్ (కాంగ్రెస్), కె.హరనాధబాబు (ఆమ్ఆద్మీ), జి. చిన్నారావు (బిఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

2 నెలలు ago

వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా…

2 నెలలు ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

5 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

5 నెలలు ago

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…

6 నెలలు ago