-0.5 C
New York
గురువారం, జనవరి 30, 2025

Buy now

spot_img

అస్వ‌స్థ‌త‌కు గురైన‌ పిల్ల‌ల‌కు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ విజయ క్రిష్ణన్
అనకాపల్లి ఆగ‌స్టు 19 : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప‌ట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోంద‌ని, వైద్యులు అన్ని ర‌కాలుగా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో  చిన్నారుల‌ను జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి తో కలిసి ప‌రామ‌ర్శించారు. చిన్నారుల‌తో, వారి త‌ల్లిదండ్రుల‌తో కలెక్టర్ మాట్లాడారు. ప్ర‌స్తుతం  వైద్య నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మెరుగైన వైద్యం అందుతోంద‌ని పేర్కొన్నారు. అంద‌రి ప‌రిస్థితీ బాగానే ఉంద‌ని భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని అన్నారు.

ఫుడ్ పాయిజన్ దుర్ఘటనపై నివేదిక అందించండి:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

అనకాపల్లి:జిల్లాలో కోటవురట్ల మండలం కైలాసపట్నంకి చెందిన ఆశ్రమంలో ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన వారి వివరాలు, ఎప్పుడు జరిగింది,ఈ ఆశ్రమానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా,దీనికి గల కారణాలు పై అనకాపల్లి జిల్లా ఉన్నతాధికారులు నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం చెప్పారు.
సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మరణించిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపున్నామని అన్నారు,మరణించిన చిన్నారుల వివరాలు,మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కి తరలించిన వారి వివరాలుపై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ నీలవేణి,అనకాపల్లి జిల్లా వైద్య అడిషనల్ వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జ్యోతి తో మాట్లాడినట్టు తెలిపారు,చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సీతారాం తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles