కసింకోటలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఎన్నికల సందడి

  • కశింకోటలో జనసేన ప్రచారం
  • కొణతాలకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ప్రచారం…

కశింకోట: జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కసింకోట లో సందడి చేశారు. జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కసింకోట మండల జనసేన కార్యాలయంలో హైపర్ ఆది కి కశింకోట జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెయిన్ రోడ్డు మీద ఆంజనేయ స్వామిని దర్శించుకుని కసింకోట మెయిన్ రోడ్ లో ఉన్న వ్యాపార సముదాయాలకు వెళ్లి వ్యాపారస్తులకు కొనుగోలుదారులకు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని అందజేసి ఈ ఎలక్షన్లో జనసేన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొణతాల రామకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కొణతాల రామకృష్ణ మాజీ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి చేశారని, ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన పరిష్కారం తెలిసిన నాయకుడని అన్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా ఆయనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించుకోవడం ద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కేంద్రంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.కసింకోటలో గురువారం వారపు సంత జరుగుతుండడంతో హైపర్ ఆది ఒకసారి గా కనబడడంతో స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. కసింకోట మెయిన్ రోడ్డు గుండా సంతబయలు జంక్షన్ గుండా కాపు వీధి , గొల్లపేట , కస్పా వీధి , పూసర్ల వీధి , కుమ్మర వీధులలో డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు.దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కశింకోట తెలుగుదేశం జనసేన మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

4 వారాలు ago

వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా…

1 నెల ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

4 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

4 నెలలు ago

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…

5 నెలలు ago