జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికుల సమావేశంలో సీఎం రమేష్
యలమంచిలి:రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండలం, గొర్లె ధర్మవరం , ముద్దుతూరు గ్రామాలలో అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి ఎంపి అభ్యర్ధి సిఎం రమేష్ కూటమి అభ్యర్ధుల కోసం ప్రచారం చేసారు. యలమంచిలి అసెంబ్లీ జనసేన ఉమ్మడి అభ్యర్ధి సుందరపు విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రమేష్ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు.వైసీపీ పాలన కొద్ది రోజులలోనే ముగిస్తుందని,రానున్నది కూటమి ప్రభుత్వమేనని అన్నారు.
సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మంచి పలుకుబడి కలిగిన సిఎం రమేష్ ఎంపి గా గెలిస్తే అందరి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు.ఈకార్యక్రమంలో ప్రగడ నాగేశ్వరావు ,బీజేపీ,టీడీపీ,జనసేన నాయకులు,కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.