అనకాపల్లి:సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు మద్దతుతో కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి జనసేన టీడిపి బిజెపి ఉమ్మడి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక రింగ్ రోడ్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మార్పు రావాలని బహిరంగంగా ప్రజలు జనసేన టిడిపి బిజెపి కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నారని రాత్రి ఒంటిగంట వరకు పోలింగ్ బూత్ లలో ఉండి ఓటింగ్ లో పాల్గొన్నారoటే ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఊహించవచ్చు అన్నారు.అనకాపల్లి జనసేన టిడిపి బిజెపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తనకు మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమం అభివృద్ధి అందించడానికి రానున్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులతో కూటమి అధికారంలోకి రాబోవుతుందనేది ఈ ఎన్నికలలో స్పష్టమైoదని అన్నారు.అనకాపల్లిలో 79.8% ఓట్లు నమోదు అయ్యాయని పోస్టల్ బ్యాలెట్లు కలిపి ఫలితాలు జూన్ 4 న వెలువడనున్నాయని తెలిపారు.మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయమని పదేళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో ఉంటూ చేసిన పోరాటాలకు ఫలితం దక్కనుంది అన్నారు.బీజేపీ జనసేన టిడిపి కలిసి సంఘటితంగా చేసిన పోరాటాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ కె.కె.వి.ఏ.నారాయణరావు మాట్లాడుతూ మొదట్లో భయపడినప్పటికీ రామకృష్ణ వంటి వ్యక్తులను అభ్యర్థిగా నిర్ణయించడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదన్నారు. సమన్వయంతో పోల్ మేనేజ్మెంట్ సజావుగా సాగిందన్నారు. వివాదం లేకుండా బిజెపి జనసేన టిడిపి కూటమి కార్యకర్తలు నాయకులు పనిచేశారన్నారు. ఈ సమావేశంలో బొడ్డేడ జోగినాయుడు , శ్రీరామదాసు గోవింద , యువ నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ , , తాడి రామకృష్ణ , మంగా ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.