అనకాపల్లి:నియోజకవర్గంలో గెలుపు ఓటములలో కాపులు కీలక భూమిక పోషిస్తున్నారు. నియోజకవర్గంలో కాపులు అత్యధికంగా ఉండడం ఇందుకు నిదర్శనం. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల 18 వేల 560 మంది ఓటర్లు ఉండగా అందులో 88,020 మంది ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మొత్తం నియోజకవర్గంలో 43% ఓటర్లు అధిక భాగం ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అనకాపల్లి, కసింకోట మండలాలు ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కాపులు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గంగా అనకాపల్లి ఏర్పడింది. దీంతో కాపులుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భౌగోళికంగా అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కులాలతో పట్టింపు లేకుండా రాజకీయ స్వలాభం చూసుకోకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గం ఏర్పాటుకు కొణతాల కృషి చేశారు. అనకాపల్లి మునగపాక మండలాలు కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అప్పట్లో గట్టిగా వినిపించినప్పటికీ, అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా అయితే బాటలు పడుతుందో ముందుచూపుతో ఆలోచించిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి కసింకోట మండలాలు నియోజకవర్గంగా ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేశారు. దీనివలన నూతనంగా ఏర్పడిన అనకాపల్లి నియోజకవర్గనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఒక విధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోడానికి కారణం కూడా అయ్యింది. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్న అనకాపల్లి, నర్సీపట్నంలలో ఏది జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో అన్న చర్చ బలంగా తెరపైకి వచ్చింది. స్వాతంత్రానికి ముందు పూర్వం నర్సీపట్నం కేంద్రంగా బ్రిటిష్ ప్రభుత్వం పాలన సాగించిందని అందుకు తగ్గట్టుగా భవంతులు నిర్మాణం జరిగిందని అన్ని విధాలుగా నర్సీపట్నం అనుకూలంగా ఉంటుందని డిమాండ్ వచ్చినప్పటికీ, కొణతాల రామకృష్ణ తీసుకున్న నిర్ణయం కారణంగా అనకాపల్లి అనుకూలంగా ఉంటుందని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు
పంపడంతో జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కొణతాల రామకృష్ణ చేసిన కృషి కారణంగా అనకాపల్లి నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా అత్యధిక శాతం జాతీయ రహదారిని కలుపుకొని ఉన్న అనకాపల్లి, కసింకోట మండలాలు కారణంగా అనకాపల్లి నియోజకవర్గ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా రూపుదిద్దుతుంది. ఒక విధంగా అనకాపల్లి జిల్లా ఏర్పాటుకు మూల కారణం కూడా అయ్యింది. దీనివల్ల పరోక్షంగా కాపులకు అత్యంత ప్రాధాన్యత కూడా ఏర్పడింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఆశయ సాధన కోసం కలిసి వచ్చే వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టారు. అనకాపల్లి నియోజకవర్గలో క్రమశిక్షణ కలిగి నిజాయితీ పరుడైన కొణతాల రామకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. మొదటినుంచి కొణతాల రామకృష్ణ కులమతాలకు అతీతంగా పనిచేస్తూ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా అనకాపల్లి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. 2019 ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం కారణంగా ఎన్నికైన అమర్నాథ్ కాపులకు న్యాయం చేస్తాడని భావించి నష్టపోయారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఐదుగురు ఆరుగురు నాయకులకు ప్రాధాన్యతను ఇచ్చి వారి ద్వారా నియోజకవర్గంలో అత్యంత అవినీతిని ప్రోత్సహించి కాపులను పక్కన పెట్టారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా కాపులు వైసీపీకి దూరం అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిధులు మాత్రం శూన్యం, గత టిడిపి ప్రభుత్వ హయాంలో టి సిరిసపల్లి కాపులు కోసం కేటాయించిన భూమి సైతం అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి అమర్నాథ్ వైసిపి పార్టీ కార్యాలయానికి కేటాయించారు. దీంతో కాపుల ఆగ్రహానికి గురైన మంత్రి అమర్నాథ్ వైసీపీ అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు కూడా భయపడింది. ఈసారి నిజాయితీపరుడిన కొణతాల రామకృష్ణని గెలిపిస్తే కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో కడుతున్న వైసిపి కార్యాలయాన్ని కాపులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కొణతాల రామకృష్ణ మాటిచ్చారంటే తప్పని భావనతో కాపు సామాజిక వర్గం కొణతాల రామకృష్ణ వెంట నడుం బిగించింది. అనకాపల్లి నియోజకవర్గం లో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు అత్యధిక మెజారిటీ ఇచ్చి వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే కాపులు నిర్ణయించుకున్నారు. ఈసారి జనసే ప్రజలు ఈసారి అనుభవం ఉన్న నిజాయితీపరుడైన కొణతాల రామకృష్ణకే ఓటేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…