అనకాపల్లి:రాజకీయాలు కొందరికి వ్యాపారం మరికొందరికి ప్రజా ప్రయోజనాలు కాపాడటం కోసం.. అందులో రెండో కోవకు చెందిన వ్యక్తి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా రామకృష్ణ పోటీ చేస్తున్నారు.అనుభవం..అవగాహన ..ఆశయం.. ఆలోచన వివేకం కలిగిన వ్యక్తి రామకృష్ణ. అన్ని పార్టీల అగ్ర నేతలతో సంబంధాలు కలిగిన కొణతాల వంటి నేత గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు. గతంలో మాదిరిగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. 2004లో మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పని చేశారు . అవినీతి అంటనీ నేతగా గుర్తింపు పొందారు..ఫ్లైఓవర్ బ్రిడ్జిలు… మెయిన్ రోడ్డు విస్తరణ.. పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి.. రైతు బజార్ల నిర్మాణం ..రహదారుల విస్తరణ.. రహదారుల అభివృద్ధి.. సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ వంటి కార్యక్రమాలను ఆయన చేపట్టారు.. ఆయన అనుభవం మళ్లీ తిరిగి ఇప్పుడు పనికివచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.. అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.. నిరాడంబరత నిస్వార్ధం అవినీతి రహిత ఆలోచన తన వారి కోసం పడే తపన కుటుంబ నేపథ్యం వంటివి ఆయనకి కలిసి వస్తున్నాయి ..అందుకే ప్రజలు ఆయనను కోరుకుంటున్నారు ..2 లక్షల పదమూడు వేల మంది ఓటర్లు ఉన్న అనకాపల్లి నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఆయనకు అందుకే మద్దతు ఇస్తున్నారు నిశితంగా ఆలోచించే మనస్తత్వం కలిగిన రామకృష్ణ గెలిస్తే నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా నిర్వహించటం.. సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే 11 చెకెడ్యాములను పునరుద్ధరించడం ..కాపు సామాజిక భవనం నిర్మాణం .. ఆర్ఈసీఎస్ ను సహకార రంగంలోకి తీసుకురావడం.. చెరుకు బెల్లం ఉత్పత్తులకు పునర్ జీవం తగిన గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవటం వంటివి జరుగుతాయని ఆశిస్తున్నారు. అందుకే ఆయన కావాలని జనం కోరుకుంటున్నారు.