2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

చట్టాలు ప్రజలకు మేలు చేసేలా దుర్మార్గులపై ఉక్కు పాదంలా ఉండాలి

అనకాపల్లి:చట్టాలు ప్రజలకు మేలు చేసేలా దుర్మార్గులపై ఉక్కు పాదం మోపేలా ఉండాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జె.డి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే సామాన్యులకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.. జ్యుడీషియరీ లేకుండా అధికారం అంతా ఎగ్జిక్యూటివ్ చేతుల్లో పెడితే రాజకీయ నాయకులు ఆడింది ఆట పాడిందే పాటగా ఉంటుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. దీనికి మేధావులైన న్యాయవాదులు పూనుకోవాలని సూచించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లి బార్ ఆధ్వర్యంలో 100 రోజులు నిరసన చేపట్టడాన్ని అభినందించారు. అనంతరం ఇటీవల ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని అభినందించారు. అధ్యక్షులు ఎం జె వి ఎన్ కుమార్, సెక్రెటరీ దుర్గారావు, ఉపాధ్యక్షులు రోజా, కోశాధికారి సందీప్, స్పోర్ట్స్ సెక్రటరీ మోహన్, లైబ్రేరియన్ జగపతి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మల్లేష్, రామచంద్రరావు, నరసింహం, తేజ , లీలా లను కండువాతో అభినందించారు. సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు, రమణయ్య, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు జె డి ను సత్కరించారు.

.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles