యలమంచిలి: శాసనసభ నియోజకవర్గ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందరపు విజయకుమార్ గురువారం అట్టహాసంగా అభిమానులు పార్టీ శ్రేణులతో తరలివెళ్లి నామినేషన్ వేశారు. అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభర్ధి సిఎం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారీ వాహన శ్రేణులతో,టిడిపి,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు వెంటరాగా విజయకుమార్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పాత్రలు దాఖలు చేశారు.ఈ సందర్భంగా సిఎం రమేష్ మాట్లాడుతూ ఈ జనసందోహాన్ని చూస్తుంటే విజయకుమార్ విజయం ఖాయమని స్పష్టం అవుతుందన్నారు .అనకాపల్లి పార్లమెంట్ తో పాటు,పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధి చేసి చూపించే అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు