అనకాపల్లి:ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కసింకోట మండలం, పరవాడపాలెం గ్రామoలో ఆదివారం ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తమను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడు గారిని ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమనీ అన్నారు.
జగనన్న ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గం లో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు.ఈ ప్రచార కార్యక్రమం లో అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, జడ్పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు, ఎంపీపీ కలగా లక్ష్మి గునయ్య నాయుడు, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్, అనకాపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరక సోమునాయుడు, గ్రామ పార్టీ అధ్యక్షులు గొంతిన శివ బాబు, ఎంపీటీసీ సారిపల్లి అచ్చియమ్మ,సారిపల్లి అప్పారావు, డోప్ప ఈశ్వరరావు, పరవాడ కామేష్,పల్లా చిరంజీవి, గొంతిన శివసంచినాయుడు,పందిరి కొండబాబు, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.