తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్
లడ్డూ అంశంపై వేగవంతం గా దర్యాప్తు జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వమును కోరిన అనకాపల్లి ఎం.పీ.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా హిందువులందరు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వెల్లడించిన విషయం మీద అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.ఎం రమేష్ గారు స్పందించారు.ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం నుండి పత్రిక ప్రకటన విడుదల చేశారు.తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ అంశం ప్రపంచ నలుమూలల ఉన్న కోట్లాది హిందువులను ఎంతో క్షోభకు గురి చేసింది అన్నారు.2019 నుండి 2024 మధ్య వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అంతర్వేదిలో రథదగ్ధం , రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహ శిరచ్చేదం , హిందూ దేవాలయాల పై దాడులు, విగ్రహాల ధ్వంసం, బలవంత మత మార్పిడులు , ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ప్రార్ధన మందిరాలు నిర్మాణం , దేవాలయాల ఆస్తుల ఆక్రమణ ,హిందువుల పండగల పై ఆంక్షలు , తిరుమల , శ్రీశైలం వంటి ప్రముఖ హిందు పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్తుల నియామకం, ధార్మికతను దెబ్బతీస్తూ వ్యాపార కార్యకలాపాలు ప్రోత్సహించడం వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి అని ఆరోపించారు.తిరుమలలో నిత్యం జరిగే అన్నదానంలో నాణ్యతా లోపాలు , దర్సనాల టిక్కెట్లు అమ్మకాలు , సౌకర్యల కల్పన , అభివృద్ధి పేరిటి చేపట్టిన పనుల్లో నిధుల దుర్వినియోగం , టీటీడీ నిధులు మల్లింపు వంటి అనేక వార్తలు మీడియా కథనలులో వచ్చాయి అని ఈ సందర్బంగా గుర్తు చేశారు.గత ప్రభుత్వంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇటువంటి అసంఖ్యాక సంఘటనలు జరిగిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని అంశాలపై దర్యాప్తు చేసి ,నిందితులను చట్టం ముందుకు తీసుకు వచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఈ అంశం మీద కేంద్రం ద్రుష్టికి తీసుకువెళ్ళాం అని కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం లడ్డూ అంశంపై దర్యాప్తు జరగాలి అని ఈ యొక్క ఆరోపణల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలని వ్యాఖ్యానించారని తెలిపారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…
బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్అనకాపల్లి ఆగస్టు 19 : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో…