దిబ్బవీధి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం

అనకాపల్లి : పట్టణంలోని దిబ్బవీధి కొబ్బరితోటలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఈనెల 19న స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్‌ గారు తెలిపారు. క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మంగళవారం ఆలయంలో స్వామివారి తిరు కల్యాణం మరియు చందన మహోత్సవ పోస్టర్‌ను ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ సింహాచలం తరువాత అనకాపల్లిలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మళ్ల దాసుడు తాతయ్యలు నిర్మించారని తెలిపారు. ఎంతో పురాతనమైన ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. సింహాచలం ఆలయంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ ఇక్కడ నిత్యం జరుగుతాయని చెప్పారు. ఆలయ నిర్వాహకులు మళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయన్నారు. మే 10న జరిగే స్వామివారి చందనోత్సవం (నిజరూప దర్శనం) జరుగుతుందని తెలిపారు. సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనానికి భక్తులు హాజరవ్వడం కష్టతరమని, సింహాచలం వెళ్లలేని భక్తులందరు అనకాపల్లి దేవాలయంలో జరిగే చందనోత్సవం (నిజరూప దర్శనం)లో స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. మే 10న తెల్లవారుజామున 2 గంటలకు మేలుకొలుపు, రెండున్నర గంటలకు స్వామి చందనం వలుపు కార్యక్రమం, భక్తులకు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం ఉంటుందన్నారు. సాయంత్రం 6:30 గంటలకు పంచామృత అభిషేకాలు మరియు సహస్త్ర కలశాభిషేకాలు జరుగుతాయన్నారు. అనంతరం స్వామి వారికి తొలి విడత చందన సమర్పిస్తారని చెప్పారు. భక్తులంతా ఈ కార్యక్రమాలకు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించి తరలించాలని కోరారు. ఈ కార్యక్రమానికి 80వ వార్డు కార్పొరేటర్‌ కొణతాల నీలిమా భాస్కర్‌, వీధి పెద్దలు, మహిళలు, యువకులు పెద్దఎత్తున హాజరయ్యారు.

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

4 వారాలు ago

వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా…

1 నెల ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

4 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

4 నెలలు ago

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…

5 నెలలు ago