-0.5 C
New York
గురువారం, జనవరి 30, 2025

Buy now

spot_img

దేవాదాయ భూములను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం

అనకాపల్లి:నడిబొడ్డునున్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న సర్వేనెంబర్‌ 66 లోని 29.71 ఎకరాల శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థాన (అంబికా బాగ్‌) భూములు సుమారు 11 వందల కోట్లు విలువైన భూములు దేవాదాయ శాఖల ఆధీనంలోఉన్నాయి. ఈ భూములు పరిరక్షణకై చుట్టూ కంచె వేసి సెక్యూరిటీని కూడా దేవాదాయ డిపార్ట్మెంట్‌ నిర్వహిస్తోంది. ఈరోజు పట్టపగలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఎండోమెంట్‌ బోర్డులను, కంచెను తొలగించి చదును చేయటం జరుగుతుంటే సాయంత్రం వరకు కూడా కనీసంగా ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని సిపిఎం నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలుసుకొని సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ బృందం జిల్లా కార్యదర్శి కె లోకనాథం నేతృత్వంలో మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌, ఆర్‌ .శంకరరావు, వివి శ్రీనివాసరావు లు అంబికా బాగ్‌ దేవాదాయ భూములు పరిశీలన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాలపై, అవినీతిపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున శ్వేత పత్రాలు విడుదల చేసి ఆక్రమణలపైన, భూకబ్జాలపైన చర్చ జరుగుతున్న సమయంలో, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణమే కోట్లాది రూపాయలు విలువైన భూములపై అధికార పార్టీ అండదండలతో ఈ ఆక్రమణకు పాల్పడుతున్నట్లుగా సిపిఎం భావిస్తుంది. ఈ భూములను ఎండోమెంట్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీ,ఎమ్మెల్యేలు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ భూములు దేవుడు భూములను సంరక్షించాలని సిపిఎం పార్టీ నేతల కోరారు.గతంలో కొణతాల వారి పేర్లతో ఈ భూములపై మాకు హక్కు ఉందని కోర్టుకెక్కి స్టే పేరుతో ఇవి తమ భూములేనని చెబుతున్నట్లుగా ఎండోమెంట్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో ఇదే భూములపై సిపిఎం పార్టీ జెండాలను పాతి ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరితే ఇది భూ ఆక్రమణ అని సిపిఎం నాయకులు పై కేసులు పెట్టడంతో పాటు ఇవి దేవాదాయ భూములను కాబట్టి ఇవి ఎవరికీ చెందవని అడ్డుకున్నారని సిపిఎం నేతలు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో నేడు ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రోక్లైన్లతో భూమిని చదును చేస్తుంటే అధికారులు, ప్రభుత్వం మీన మెసాలు లెక్కించడం చూస్తుంటే వారి పాత్ర ఉందనే అనుమానలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనపై తగిన విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఎండోమెంట్‌ అధికారులు ఆక్రమణదారులపై కేసు నమోదు చేసి తగిన చర్యలకు ఉపక్రమించాలని, లేకపోతే ప్రజా పోరాటాలకు సిద్దం కావల్సి వస్తుందని సిపిఎం పార్టీ హెచ్చరిస్తోంది.

నాడు ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకుంటున్న పైల్ వీడియో

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles