నూకాంబిక అమ్మవారి జాతర పటిష్ట బందోబస్తు

అనకాపల్లి:  గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర నెల రోజులు పాటు జరగనున్న సందర్భంగా ఆలయాన్ని జిల్లా ఎస్పీ  కె.వి.మురళీకృష్ణ  ఆలయ పరిసరాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్ తదితర సంబంధిత అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.అప్పలరాజు,అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ జి.శంకర రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.పైడపు నాయుడు మరియు దేవస్థానం ఈవో బండారు ప్రసాద్ లకు భద్రతాపరమైన సూచనలు చేశారు.నెలరోజుల పాటు జరిగే అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ చేసి, విధులు అప్పగించాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో దృష్టి పెట్టాలని, దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు. భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. రద్దీ వున్నప్పుడు తోపులాట జరగకుండా చూడాలని సిబ్బంది అప్రమత్తంగా వుండాలన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ తో పాటు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ  ఎస్.అప్పలరాజు, అనకాపల్లి టౌన్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, దేవస్థానం ఈవో మరియు సిబ్బంది పాల్గొన్నారు.

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

4 వారాలు ago

వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా…

1 నెల ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

4 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

4 నెలలు ago

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…

5 నెలలు ago