-0.5 C
New York
గురువారం, జనవరి 30, 2025

Buy now

spot_img

పుడ్ పాయిజన్ కేసులో ముగ్గురు మృతి

అనకాపల్లి:కోటవురట్ల ఫుడ్ పాయిజన్ కేసుకి సంబంధించి అనకాపల్లి లో జిల్లా ఎస్పీ ఎం.దీపిక మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కేసులో పరిశుద్ధాత్మ అగ్ని శృతి ఆరాధన ట్రస్ట్ నడుపుతున్న నిర్వాహకుడు కిరణ్ కుమార్ ను అరెస్టు చేసామని ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు పిల్లలు మృతి చెందారని ఎస్పీ తెలిపారు.ఇద్దరు చింతపల్లి కి చెందిన పిల్లలు కాగా ఒకరు కొయ్యూరు కు చెందిన బాలిక ను గుర్తించారు.

శనివారం ఒక కార్యక్రమంలో మిగిలిపోయిన అన్నం సాయంత్రం పిల్లలకు పెట్టడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.ఇంకా 35 మంది పిల్లలకు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని,

కొంతమందికి మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖ KGH కు కూడా పంపించారని తెలిపారు

అనుమతి లేకుండానే అక్రమంగా గిరిజన పిల్లలను తీసుకువచ్చి పరిశుద్ధాత్మ అగ్ని శృతి ఆరాధన ట్రస్ట్ నడుపుతున్న నిర్వాహకుడు కిరణ్ కుమార్ ఫుడ్ పాయిజన్ జరిగిన పిల్లలను నిర్లక్ష్యంగా వారికి చికిత్స చేయించకుండా, పోలీసులకు తెలుపకుండా వారి గ్రామాలకు పంపించి వేయడం వల్ల సకాలంలో వైద్యం అందక పోవడం వలన చనిపోయారని విచారణలో  తేలింది.నిర్లక్ష్యంగా వ్యవహరించిన కిరణ్ కుమార్ పై 304 part 2, 105 BNS సెక్షన్ తో అరెస్టు చేశామని ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు.విచారణ ఆధారంగా ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారో వారిని నిందితులుగా చేర్చి ఇంకా పలు సెక్షన్ల తో కేసులు నమోదు చేసి పటిష్టమైన దర్యాప్తు నిర్వహించి శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనధికార హాస్టల్స్ ఉన్నాయా అని తనిఖీలు నిర్వహిస్తామని ,అటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని ప్రభుత్వ హాస్టల్స్ లో చేరేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్  తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles