అనకాపల్లి:పేద ప్రజల సంక్షేమ కోసం అహర్నిశల కృషిచేసిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ జయంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో రింగ్ రోడ్డు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వైద్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్సార్ అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు అనంతరం జన్మదిన కేక్ కట్ చేశారు.అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు భరత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేసి పలుచోట్ల పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి, దంతులూరి దిలీప్ కుమార్ కార్పొరేటర్లు మందపాటి సునీత, కొణతాల నీలిమ భాస్కర్, పీలా సౌజన్య రాంబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, జాజుల రమేష్, బొడ్డేడ శివ, మునూరు శ్రీను, మలసాల కిషోర్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, సూరిశెట్టి రమణ అప్పారావు, కొణతాల మురళీకృష్ణ, ఆళ్ల నాగేశ్వరరావు, దాడి నారాయణరావు , కేయం నాయుడు, ఉగ్గిన అప్పారావు సురేష్ కొండూరు రవి, గైపురి రాజు, ఏ.వి. రత్నకుమారి, గుప్తా, జ్ఞానదీప్, కుండల రామకృష్ణ, మరిపల్లి శోభ పద్మ, లక్ష్మి, కోన ఉమా దాడి రవికుమార్, హైమా, శరగడం నాయుడు, కళ్యాణ్, పీలా శ్యామ్, పెంటకోడు శ్రీను, వెలుగుల కృష్ణ చైతన్య అఖిల్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బైపాస్ రోడ్డు చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ల వద్దనున్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు భరత్ కుమార్ పూలమాలలు వేసి నివాళు లర్పించారు.