కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి
- మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడి
అనకాపల్లి:మానవ హక్కుల రక్షణకు కవచంగా ఉండడమే మానవ హక్కుల కౌన్సిల్ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జార్జిక్లబ్ సమావేశ మందిరంలో మానవ హక్కుల అనకాపల్లి జిల్లా కౌన్సిల్ సభ్యుడు మళ్ల సన్యాసినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకు మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు ప్రజలందరికీ గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు కూడా కౌన్సిల్ సభ్యులు అండగా ఉండాలన్నారు. గడచినా 20ఏళ్లుగా ప్రజలకు మానవహక్కుల కౌన్సిల్ విస్తృత సేవలు అందించడం పట్ల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ అభినందనీయమన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే మానవ హక్కుల కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు చట్టాలను ఉల్లంఘించిన వారిపై 6వేలు కేసులు నమోదు కాగా వాటిలో 1200 కేసులకు తీర్పు వెలువడిరదన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, అడవులను పెంపొందించడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మానవహక్కులను పరిరక్షించే కౌన్సిల్ సభ్యులపై దాడులు జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వచ్చే నవంబరులో జిల్లాలో ఉన్న మానవహక్కుల కౌన్సిల్ సభ్యులకు అనకాపల్లిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించననున్నామని తెలిపారు. అనంతరం స్టేట్‌చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు ఎస్.వి. రమణ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే అంశాలను వివరించారు. జిల్లాలో కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో అనకాపల్లికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎటువంటి సమస్యనైనా కౌన్సిల్ సభ్యులంతా పరిష్కరించి బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బి.సురేష్, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, పాడేరు, నర్సీపట్నం, అరకు ప్రాంతాలకు చెందిన మానవహక్కుల కౌన్సిల్‌కు చెందిన సభ్యులు పాల్గొన్నారు. -