కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే రాజ్యాంగాన్ని పరిరక్షించండి.. ఇండియాకూటమి ని గెలిపించండి.అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్
అనకాపల్లి: రాజ్యాంగాన్ని పరిరక్షించండి ఇండియాకూటమి ని గెలిపించండి అనే నినాదం తో అనకాపల్లి పట్టణం లో స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజ్యాంగ పరిసరక్షణ వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం తో అధికారంలోకి వచ్చి రాజకీయాలను వ్యాపారం చేసిందన్నారు. దానికి ఆంద్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రభుత్వం సహకరిస్తందన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హెూదా పైనే మొదటి సంతకం చేస్తారన్నారు. మనకు శ్రీరామ రక్ష లాంటి పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పూర్తి చేస్తుందన్నారు. వైసిపి, బిజెపి ఎంపి అభ్యర్ధులు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. చేస్తున్న మోసాలను నయవంచన అనే పుస్తకం ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కో- కన్వీనర్ విజయ రామారావు, చలసాని శ్రీనివాస్ విభజన హామీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఐఏఎస్ అజయ్ శర్మ ఉత్తరాంధ్ర కార్యదర్శి, అనకాపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఐ. ర్ గంగాధర్, మాడుగుల అభ్యర్థి బొడ్డు శ్రీనివాసు, నర్సీపట్నం అభ్యర్థి రుత్తల, అనకాపల్లి జిల్లా లోని 7 నియోజకవర్గాల ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు, తదితరులు పాల్గోన్నారు.