జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది
పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్
అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి విశాఖపట్నంలో బహిరంగ సభ లో పాల్గొని, జిల్లాలో పలు ప్రోజెక్టులకు వర్చువల్ గా శంఖుస్థాపన చేయనున్నారని, ప్రజలు హాజరై ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకాలని పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ కోరారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు. విలేఖరుల సమావేశంలో పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ అభివృద్దికి కూటమి ప్రభుత్వం అనుకూలమని, పెట్టుబడుదారులు జిల్లాలో పెట్టుబడులు పెట్టుటకు ఆశక్తిచూపుతున్నారని తెలిపారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందితే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. పధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో డబుల్ ఇంజను సర్కారు నడుస్తున్నదని, పరిశ్రమలు, విద్యాసంస్థలు స్థాపన, రైల్వే ప్రోజెక్టులు, రోడ్లు నిర్మాణాలతో జిల్లా స్వరూపం మారనున్నదని తెలిపారు. జిల్లాలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో నిర్మించునున్న పరిశ్రమలకు ప్రదానమంత్రి శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాలలో కూడా పరిశ్రమలు స్థాపనకు ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వారి మాట ప్రకారం గోదావరి పనులు జరుగుతున్నాయని, సంవత్సరకాలంలో గోదావరి ఎడమ కాలువద్వారా గోదావరి జలాలు వస్తాయని తెలిపారు. జిల్లాలో అదనంగా యలమంచిలి, మాడుగులలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు, మరియు మాడుగులలో ఇంజనీరింగు యూనివర్శీటీకి స్థాపనకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా అనుసందానం చేయనున్నట్లు పార్లమెంటు సభ్యులు తెలిపారు. విశాఖపట్నం నుండి పాడేరుకు 16వ నంబరు జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణం, తుని నుండి విజయనగరం జిల్లాను కలుపుతూ నర్సీపట్నం మాడుగుల, చోడవరం మీదుగా జాతీయ రహదారి నిర్మాణం, పోర్టులను అనుసంధానం చేస్తూ సముద్ర తీరంలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని, అనకాపల్లి నుండి రాజమండ్రి నాలుగువరుసలు రోడ్డు ఆరు వరుసలుగా అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. అమృతపురం నుండి షీలానగర్ రోడ్డు పనులు త్వరలో ప్రారంబించనున్నట్లు తెలిపారు.యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలో స్థాపించనున్న రెండు పరిశ్రమలు స్థాపన ద్వారా సుమారు ఇరవై అయిదువేల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, రోడ్లు నిర్మాణం ద్వారా అబివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో శాసనసభ్యులు బండారు సత్యనారాయమూర్తి, అర్బన్ పైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషను చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రోడ్డు డెవలప్మెంటు కార్పొరేషను చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, కొప్పులవెలమ సంక్షేమ, అభివృద్ది కార్పొరేషను చైర్మన్ పి.వి.జి. కుమార్, దాడి రత్నాకర్ పాల్గొన్నారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…
బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్అనకాపల్లి ఆగస్టు 19 : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో…