అనకాపల్లి:జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ కేవీ మురళీకృష్ణ లతో కలిసి పోలీసు అధికారులు, కేంద్ర బలగాల అధికారులతో శాంతిభద్రతల నిర్వహణ విషయమై చేపడుతున్న చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల్ని నియమించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఎక్కడా తీవ్రస్థాయి గొడవలు తలెత్తే అవకాశం లేదని అయినా పోలీసు అధికారులు భద్రతా దళాలు అత్యంత జాగరూకతతో విధి నిర్వహణ చేయాలన్నారు. చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు వెళ్లేటప్పుడు వాహనాన్ని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరాదన్నారు.. పోలింగ్ సమయంలో మొదటి మూడు గంటలు, ఆఖరు రెండు గంటలు కీలకమైనవనీ ఆ సమయంలో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు జరగకుండా చూడాలన్నారు. అదేవిధంగా పోస్టర్లు కటౌట్లు ఏర్పాటు చేయరాదన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంటిలిజెంట్ రిపోర్టు ద్వారా ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ “నో వైలెన్స్-నో రీపోల్” అనే భావంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని పరిశీలించి అంచనాలు రూపొందించామని సమస్యాత్మక కేంద్రాలకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసామన్నారు. ఎన్.సి.సి., ఎన్.ఎస్. ఎస్., ఎక్స్ సర్వీస్ మెన్ ల సేవలు వినియోగించుకునే సమయంలో వారిని వేరొక నియోజకవర్గంలో విధులకు వినియోగించు కోవాలని అన్ని విధాలా పరిశీలించి వివాహ రహితులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
పరిశీలకులు మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిష్పక్షపాత పారదర్శక మైన ఎన్నికలు జరిగేలా అందరూ కృషి చేయాలన్నారు. ఆఖరు రెండు రోజులలో వివిధ స్థాయిలలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే అవకాశాలు ఉన్నందున సూక్ష్మస్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో సాధారణ పరిశీలకులు దల్జీత్ సింగ్ మంగత్, రాకేష్ కుమార్, మోహన్ దహికర్, రామస్వామి, ఏ ఎస్ పి బి.విజయభాస్కర్ ఆరు నియోజకవర్గాల డిఎస్పీలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి రామ్మూర్తి ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…