2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను వెంటనే అరెస్టు చేయాలి-సిపిఎం డిమాండ్

అనకాపల్లి:చోడవరం పట్టణంలో జిఎస్టి అధికారులను బెదిరించి దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయటమే కాకుండా సీఎం రమేష్ ను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం అనకాపల్లి మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది. రాయలసీమ ప్రాంతం నుంచి గుండాయిజంతో అనకాపల్లి ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారని మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీను వాసరావు, చింతకాయల శివాజీలు అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో హత్య రాజకీయాలు, గుండా రాజకీయాలకు ఇప్పటివరకు తా వు లేకుండా ఉందని, నేడు కడప నుంచి దిగుమతి అయిన బిజెపి నాయకుడు సీఎం రమేష్ రాకతో ఈ ప్రాంతంలో అటువంటి వాతావరణ సృష్టించడం కోసం సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. అంతే కాకుండా ఇప్పటికే జిల్లాలో ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడంతో పాటు అక్రమ మద్యం నిలువలు వంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయని వీటిపై కూడా బిజెపి అభ్యర్థిపై అనుమానాలకు తావునిస్తుందని అన్నారు. దీనిపై జిల్లా రిటర్నింగ్ అధికారి కి పిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే సీఎం రమేష్ అరెస్టు చేయాలని, దౌర్జన్య రాజకీయాలకు చెక్ పెట్టాలని, అక్రమ మద్యంపై మరింత కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles