అనకాపల్లి: నా పేరు మలసాల నివేదిత.. నా భర్త మలసాల భరత్ కుమార్ అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు తమ చల్లని ఆశీస్సులు అందించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. పట్టణంలోని జీవీఎంసీ 82వ డివిజన్ లోని నర్సింగరావుపేట ప్రాంతంలో ఆ వార్డు వైసిపి కార్పొరేటర్ మందపాటి సునీత జానకిరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు జానకిరామరాజు భరత్ సతీమణిగా నివేదితను ప్రజలకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. ఎన్నికల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా జానకిరామరాజు తో కలిసి ఇంటింటికి వెళ్లిన నివేదితకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపించారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. వార్డులో వినూత్న రీతిలో నివేదిత ప్రచారం నిర్వహించారు. అందరినీ ఆకట్టుకున్నారు. చిరు వ్యాపారులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా ఓ బజ్జీలు అమ్ముకునే షాపు వద్ద ఆగి ఆమె స్వయంగా బజ్జీలు వేసి అందరినీ ఆనందంలో నింపారు. అలాగే ఓ మహిళ నడుపుతున్న టైలరింగ్ షాపు వద్దకు వెళ్లారు. కాసేపు మిషన్ కుట్టారు. కార్యకర్తల్లో జోష్ ను నింపారు. అలాగే కాయగూరలు అమ్ముకునే వాళ్లను కూడా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలతో నివేదిత మమేకమయ్యారు.
అందరి దృష్టిని ఆకర్షించారు. నివేదిత కలుపుగోలుతనానికి అందరూ ముగ్ధులయ్యారు. మా ఓటు మీకే అంటూ వార్డులో ప్రజలు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త మలసాల భరత్ కుమార్ ను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నివేదిత విజ్ఞప్తికి ప్రజలు సానుకూలంగా స్పందించారు. సుమారు రెండు గంటలపాటు పాదయాత్ర ద్వారా నరసింగరావుపేటలో వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, ఇంటింటి ప్రచారం నిర్వహించిన నివేదితకు స్థానికుల నుంచి అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. అనంతరం వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ నిగర్వి, నిరాడంబరుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త అయిన
అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కు, అలాగే నిస్వార్థ నాయకుడు ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను వినమ్ర పూర్వకంగా ఓటును అభ్యర్థించారు. జానీ విజ్ఞప్తికి ప్రజలు సంపూర్ణ ఫద పీపుల్ మద్దతు పలికారు. ప్రతిపక్షాలు ఆచరణ సాధ్యం కాని అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని వాటిని నమ్మవద్దని వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి వైసిపి తోనే సాధ్యమని తెలిపారు. భరత్ గెలుపు అనకాపల్లి అభివృద్ధికి మలుపు అవుతుందన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు గైపూరి రాజు, కడిమిశెట్టి సతీష్, మునూరు శ్రీనివాసరావు, కుండల రామకృష్ణ, కొండ్రపు సత్తిబాబు, కోన ఉమ, కడిమిశెట్టి లక్ష్మణరావు, మొగలపల్లి సుబ్బారావు, గుండా రమేష్ గుప్తా, చింతా రాంజీ, ప్రభాస్ శ్రీనివాస్, శ్రీధరాల మనోజ్, పాలికి కొండబాబు, ఎస్ జె మోహన్, సాలాపు రమణ, కోటపాడు శివ, పేలూరి కళ్యాణ్, మొల్లేటి మూర్తి, ఈతలపాక సత్యనారాయణ, సోమాదుల హేమ, డొంక సత్తిబాబు నరసింగరావుపేట ప్రజలు,
పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…