అనకాపల్లి :జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ భారత్ స్కౌట్స్, గైడ్స్ సంస్థలో శిక్షణ పొందిన యువతి యువకులకు 18-40ఏళ్లలోపు యువ ఆపదమిత్ర అను ప్రవేశపెట్టియున్నారని అనకాపల్లి జిల్లా కార్యదర్శి, స్టేట్ కోఆర్డినేటర్ కొణతాల రత్నకుమారి తెలిపారు సమీప ప్రాంతాల్లో వరదలు, భూకంపాలు, సునామీ వంటివి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు నియమించనున్నారు. జాతీయ
విపత్తు నిర్వహణ సంస్థతో పాటు సహాయం చేసేందుకు వీరిని విపత్తు నిర్వహణ సంస్థ
ఆధ్వర్యంలో ఆసక్తి యువతి యువకులకు వారం రోజులు శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసిన యువతి యువకులకు అత్యవసర పరికరాలఅందజేస్తారన్నారు. అంతేకాకుండా శిక్షణ యువతి యువకులను మూడేళ్లపాటు సదుపాయం కల్పిస్తారన్నారు.శిక్షణకు జిల్లాకు చెందిన18-40ఏళ్లలోపువారు ఏడవ తరగతి పాసైన వారు అర్హులన్నారు. శారీరక మరియు మానసిక దృఢత్వం కలిగి ఉండాలన్నారు. పూర్తిగా స్వచ్ఛంద సేవకు మాత్రమేనని గుర్తించాలన్నారు. పాఠశాలలో స్కౌట్స్, గైడ్స్ శిక్షణ పొంది ప్రస్తుతము కాలేజీల్లో చదువుతున్న ఆసక్తిగల విద్యార్థులు యువ ఆపద మిత్ర పధకానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని స్టేట్ రేంజర్ కోఆర్డినేటర్, అనకాపల్లి జిల్లా కార్యదర్శి కొణతాల రత్నకుమారి తెలిపారు. వివరాలకు ఏఎస్వోసీ షరీఫ్ ఫోన్ నెంబర్ 99081 86967లో సంప్రదించాలని సూచించారు