2.5 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

యాదవుల సంక్షేమానికి కృషి చేస్తాం

వైసీపీ ప్రభుత్వంలోనే యాదవులకు  మేలు

అనకాపల్లి: జిల్లా తుమ్మపాల గ్రామంలో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి విశాఖ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి,పార్లమెంటు సభ్యురాలు బి వి సత్యవతి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు,అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వము విలువ ఇవ్వలేని యాదవులకు ఈ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాముఖ్యతను మనకు ఇవ్వడం జరిగిందని దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎవరు వచ్చిన మొట్టమొదటిగా కలవడానికి అవకాశం కలిగించినట్లుగా మీలో ఒకరినైనా యాదవ కులానికి సంబంధించిన నన్ను మేయర్గా నియమించడం నా ఒక్కరికే కాదు గాని యాదవ కులానంతటిని కి ఆ గౌరవం దక్కేలా ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అని అలాంటి ముఖ్యమంత్రి మనము ఎన్నుకుంటే రానున్న రోజులలో మనకి ఎంతో మేలని మన కులానికి సంబంధించి రాజ్యసభలోను అసెంబ్లీలోనూ ప్రతి చోట మంత్రి పదవులను ఇచ్చి మనలను ప్రోత్సహిస్తున్నందుకు మనము కృతజ్ఞతగా ఆయననే గెలిపించుకోవాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే అనకాపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనసాల భరత్ నీ పార్లమెంట్ సభ్యుడు మూడు ముత్యాల నాయుడుని గెలిపించాలని అన్నారు ఈ సమావేశంలో బూడిముత్యాల నాయుడు మాట్లాడుతూ పేదవాడికి ధనికునికి స్థానికుడికి స్థానికేతరుడికి పోటీ అని కడప వానికి అనకాపల్లి తో సంబంధం ఏంటని ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని బ్యాంకులో లూటీ చేసిన వ్యక్తికి అనకాపల్లిలో పార్లమెంటు సభ్యుడిగా కాదు గాని అనకాపల్లి ప్రజలు ఎన్నికల తదనంతరం పార్సల్ చేసి కడప పంపిస్తారని అన్నారు జగనన్న చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలని గత ఎన్నికలలో నవరత్నాలు ద్వారా ప్రజల ముందుకు వచ్చిన అవన్నీ గెలిచినాక ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఏ మాట అయితే ఇచ్చారో అవన్నీ నెరవేర్చారని మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే ఇంకా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సంక్షేమ పథకాలను నెరవేర్చడంలో సంసిద్ధులై ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగిందని యాదవ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి నాయకులను నియమించి దాని ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగిస్తున్నారని అన్నారు ప్రభుత్వమే కొనసాగించినట్లయితే యాదవ కులానికి సంబంధించి మీరే అయితే అడిగారు వాటన్నిటిని నెరవేర్చడానికి నేను పార్లమెంటు అభ్యర్థి అయిన బూడి ముత్యాల నాయుడు ఆ మీరు అడిగిన వాటిని నెరవేర్చే టట్లు హామీ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్ కన్నారావు వార్డ్ మెంబర్ భాస్కరరావు తదితరు యాదవ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles