పెందుర్తి:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ కు అన్ని విదాల సహాయసహకారాలందిస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేసారు. దేశవ్యాప్తంగా బిజెపి చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆపార్టీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు అద్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. పెందుర్తి కూడలి నుండి పోలీస్ స్టేషన్ వరకు విద్యార్దులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే రమేశ్ బాబు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవిభజన సమయంలో పాకిస్తానీయులు సాగించిన మారణకాండను నిరసిస్తూ ఏటా ఆగస్టు 14న బిజెపి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆనాడు మహిళల మానప్రాణాలను హరించడంతో పాటు ఆస్తులను కొల్లగొట్టారని గుర్తు చేసారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అనేక దుశ్చర్యలకు పాల్పడ్డారని వెల్లడించారు. గత పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేవిదంగా పాలన సాగిస్తోందని తెలిపారు. గత ఐదేళ్లలో అన్నివిధాలా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ అభివ్రుద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో పాటుపడుతున్నారని వారికి ప్రదాని మోదీ పూర్తి సహాయసహకారాలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అద్యక్షుడు కరకదేముడు, మాజీ జడ్పిటిసి సభ్యులు రెడ్డి నారాయణరావు, బయలుపూడి హరి గోపాల్, బిజెపి నాయకుడు గొర్ల రామనాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.