-0.5 C
New York
గురువారం, జనవరి 30, 2025

Buy now

spot_img

వాలంటీర్లు మేలుకో ప్రత్యామ్నాయం ఎంచుకో

AP: యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల చెంతకే  సేవలు అందించడంతో ప్రజల నుంచి వాలంటీర్లకు ప్రశంసలతో పాటు మంచి గుర్తింపు లభించింది. అదేవిధంగా ప్రభుత్వానికి సైతం మంచి పేరును వాలంటీర్లు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమను విధులలోకి తీసుకుంటారో లేదో అన్న సందిగ్ధంలో కాలం వెళ్లదీస్తున్నారు.ప్రస్తుతం పెన్షన్ల పంపిణీలో గ్రామ సచివాలయ సెక్రటరీల ద్వారా తక్కువ సమయంలోనే పెన్షన్లు పంపిణీ చేసి వాలంటీర్ల ఆవశ్యకత అంతగా లేదనే విధంగా పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యాచరణలో రావడం ఆలస్యం అవుతుంది. వాలంటీర్లను విధులు లోకి తీసుకున్నప్పటికీ యధావిధిగా వారికే ఇస్తారా లేదా అన్నది మరొక ప్రశ్న. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానికులకు వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన లేదా టిడిపికి చెందిన కుటుంబాలలో వారికి వాలంటీర్ల అవకాశం లభించడంతో విధులు నిర్వహించారనేది వాస్తవం. వాలంటీర్లను విధుల్లోకి మళ్ళీ తీసుకున్నప్పటికీ గతంలో టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసిన నిర్వాహకాలు బట్టి ముందుగా టిడిపికి చెందిన వారికి ముందుగా ప్రాధాన్యత కల్పిస్తారనేది మరొక వాదన వినిపిస్తుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూడకుండా ఇప్పటికైనా మేల్కొని  వాలంటీర్లు ప్రత్యామ్నాయంగా మరొక ఉపాధిని ఎంచుకోవడంలో ఉత్తమమైన మార్గం లేదనేది మా అభ్యర్థన……

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles