AP: యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల చెంతకే సేవలు అందించడంతో ప్రజల నుంచి వాలంటీర్లకు ప్రశంసలతో పాటు మంచి గుర్తింపు లభించింది. అదేవిధంగా ప్రభుత్వానికి సైతం మంచి పేరును వాలంటీర్లు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమను విధులలోకి తీసుకుంటారో లేదో అన్న సందిగ్ధంలో కాలం వెళ్లదీస్తున్నారు.ప్రస్తుతం పెన్షన్ల పంపిణీలో గ్రామ సచివాలయ సెక్రటరీల ద్వారా తక్కువ సమయంలోనే పెన్షన్లు పంపిణీ చేసి వాలంటీర్ల ఆవశ్యకత అంతగా లేదనే విధంగా పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యాచరణలో రావడం ఆలస్యం అవుతుంది. వాలంటీర్లను విధులు లోకి తీసుకున్నప్పటికీ యధావిధిగా వారికే ఇస్తారా లేదా అన్నది మరొక ప్రశ్న. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానికులకు వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన లేదా టిడిపికి చెందిన కుటుంబాలలో వారికి వాలంటీర్ల అవకాశం లభించడంతో విధులు నిర్వహించారనేది వాస్తవం. వాలంటీర్లను విధుల్లోకి మళ్ళీ తీసుకున్నప్పటికీ గతంలో టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసిన నిర్వాహకాలు బట్టి ముందుగా టిడిపికి చెందిన వారికి ముందుగా ప్రాధాన్యత కల్పిస్తారనేది మరొక వాదన వినిపిస్తుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూడకుండా ఇప్పటికైనా మేల్కొని వాలంటీర్లు ప్రత్యామ్నాయంగా మరొక ఉపాధిని ఎంచుకోవడంలో ఉత్తమమైన మార్గం లేదనేది మా అభ్యర్థన……
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…