2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

రెంటికి చెడ్డ రేవడిలా వాలంటీర్ల పరిస్థితి

అనకాపల్లి: వాలంటీర్ల ముకుమ్మడి రాజీనామాల వెనక వైసీపీ హస్తం ఉన్నట్లు ఉమ్మడి పార్టీల శ్రేణుల్లో విమర్శలు వెలుగుతున్నాయి. వాలంటీర్లు వైసిపిపై అభిమానంతో రాజీనామా చేయడం లేదని వైసిపి నేతల ఒత్తిడితో రాజీనామాలు చేస్తున్నారని తెలుపుతున్నారు. వాలంటీర్లకు తమ బాధ్యతలనుంచి రాజీనామా చేసిన వారిని వైసిపి అధికారం రాగానే మళ్లీ వాలంటీర్లుగా నియమిస్తామని చెబుతూ రాజీనామాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏమిటని అయోమయంలో వాలంటీర్లు ఉన్నారని ఉమ్మడి పార్టీల నేతలు తెలుపుతున్నారు.చాల ప్రాంతాల్లో రాజినామ చేయాలని వైసిపి నేతలు ఒత్తిడి తీసుకురావడంతో వాలంటీర్లు మనోవ్యద కి గురవుతున్నారు.కనీసం జనసేన, టిడిపి నేతల మద్దతు సైతం లభించడం లేదు. పార్టీలకు అతీతంగా వాలంటీర్లు మన ఇంటి ప్రక్కనే ఉండి ఇన్నాళ్లు మనకు మన కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సేవలు అందించారు. అవన్నీ మరిచి వారిని వైసిపి కార్యకర్తలుగా భావిస్తూ వారు ఎక్కడికి వెళ్లినా ప్రచారం చేస్తున్నారంటూ ఫోటోలు తీసే విధంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతల వ్యవహరిస్తున్న తీరుతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల పరిస్థితి అటు వైసిపికి ఇటు ఉమ్మడి పార్టీల వారికి చెందక రెంటికి చెడ్డ రేవడి అనే పరిస్థితి ఏర్పడింది. మరికొన్నిచోట్ల వాలంటీర్లు ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles