విజయోత్సవాన్ని తలపిస్తూ కోణతాల నామినేషన్

అనకాపల్లి:జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కొణతాల రామకృష్ణ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించే విధంగా త్రిశక్తుల కలయికతో కదిలిన మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్క సారిగా జనసేన కార్యాలయం నుండి ర్యాలీ గా గాంధీనగరం రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోవడంతో ఆ ఊరేగింపు విజయోత్సవాన్ని తలపించింది.అనకాపల్లి కశింకోట మండలాల నుండి భారీ సంఖ్యలో యువకులు, ఆటో లపై మహిళలు, పెద్దలు వేడి గాల్పులను మండుటెండను సైతం కూడా పట్టించుకోకుండా జై కొణతాల జై జై కొణతాల అంటూ జనసేన కార్యాలయానికి చేరేసరికి పదులు వందలుగా, వందలు వేలగా మారిన దృశ్యం ప్రజా హృదయాలలో కొణతాల స్థానం ఏమిటో తెలియజేసింది.మరో వైపు వివిధ గ్రామాల నుండి యువకులు జనసైనికులమంటూ జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ కొణతాల గెలుపు అనకాపల్లి అభివృద్ధికి మలుపు అంటూ అన్ని వైపుల నుండి జనసేన కార్యాలయానికి చేరే సరికి ఆ ప్రాంతం అంతా పసుపు, తెలుపు, కాషాయి జెండాలతో నిండిపోయి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల జాతరను తలపించింది. బాణాసంచా శబ్దాలు ఒకవైపు కోలాటాలు, పులి వేషాలు, రకరకాల సంస్కృతిక కార్యక్రమాలు మరోవైపు ర్యాలీలో కదులుతుంటే అంగరంగ వైభవంగా మారింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు తామే అభ్యర్థిగా నడవడంతో ఇది కదా విజయానికి సంకేతం అన్పించింది. కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతం అవడంతో నామినేషన్ వేయడానికి కదిలారు రామకృష్ణుడు ఈ ఆనందోత్సవాల మధ్య ఆయన మాట్లాడుతూ మీ అందరి అభిమానం మర్చిపోలేనిదని అనకాపల్లి అభివృద్ధికి నిరంతరము కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు జరగబోయే వివిధ పథకాలను వివరించారు.గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను కమలం పువ్వు పై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా ఉద్యమాల సారధి గౌతు లచ్చన్న, కొణతాల రామకృష్ణ
అనకాపల్లి:ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలిసి పరిస్కారం కోసం ఉద్యమాలు చేసిన గొప్ప నేత ఉత్తరాంధ్ర వాసి స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు నేటి తరం యువత గుర్తు చేసుకోవాలని మాజీ మంత్రి కూటమి అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు,శుక్రవారం గౌతు లచ్చన్న 18 వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ గౌతు లచ్చన్న బ్రిటిష్ ప్రభుత్వం కి జమీందారి వ్యవస్థ కి వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపిన గొప్ప వ్యక్తని 1930 నుండి 1980 వరకూ అలుపెరుగని పోరాటం చేసారని మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తూ బహిష్కరణ, లాంటి ఉద్యమాలు నడిపించారని లచ్చన్న తాను పుట్టిన గ్రామం బారువలో హరిజన సేవా సంఘం ఏర్పాటు చేసి ఆస్పృశ్యత నివారణ ఉద్యమం చేసిన గొప్ప మానవతా వాదని కొనియాడారు,బర్మకాందిశీకులకోసం ఆచార్య రంగా, లచ్చన్న పెద్ద సభలు నిర్వహించి ప్రజా ఉద్యమాలకు మార్గం చూపారని అన్నారు,క్విట్ ఇండియా ఉద్యమం లో కీలక పాత్ర పోషించారని తెలిపారు లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాటలాడుతూ సర్ధార్ గౌతు లచ్చన్న 1948 లో రాష్ట్రంలో మొదటిసారిగా వెనుకబడిన తరగతుల ప్రజలు,వారి ప్రాధమిక హక్కులు,రిజర్వేషన్లు పొందేలా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో వెనుకబడిన తరగతుల జాబితా పునరుద్ధరణ చేసి విజయం సాధించారని,1950 లో ఏర్పాటు చేసిన కృషికార్ లోక్ పార్టీ లో కీలక పాత్ర పోషించారని,ప్రకాశం పంతులు మంత్రి వర్గంలో పనిచేశారని 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ పెద్ద మనుషుల ఒప్పందం పై ఉన్న మూడు సంతకాల్లో లచ్చన్న ది ఒకటి కావడం సంతోషకరమైనదని అన్నారు,దేశ చరిత్రలోనే సర్ధార్ వల్లబాయి పటేల్ తరువాత సర్ధార్ అనే గౌరవం పొందిన ఏకైక భారతీయుడు తెలుగు వాడు లచ్చన్న ఒక్కరే కావడం ఉత్తరాంధ్ర వాసులకు గర్వం ఉందని అన్నారు.గౌతు లచ్చన్న కి నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ నాగజేగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

4 వారాలు ago

వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా…

1 నెల ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

4 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

4 నెలలు ago

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…

5 నెలలు ago