అనకాపల్లి:మాజీ మంత్రి జనసేన టిడిపి బిజెపి అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయపురం వైపు దూసుకుపోతున్నారు.. రోజురోజుకు అయిన గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది.. ఆయన గెలుపు దాదాపు నల్లేరుపై బండి నడకేనని రాజకీయ విశ్లేషకులు ఒక నిర్ణయానికి వచ్చారు. బలమైన మద్దతు ప్రజల నుండి లభిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను ఆదరించడం విశేషం. సొంతం మనిషి మాదిరిగా స్వాగతం పలుకుతున్నారు ఆదరిస్తున్నారు. కసింకోట అనకాపల్లి మండలాలతో పాటు అనకాపల్లి పట్టణంలో కూడా అనూహ్య రీతిలో ఆయనకు బలం పెరిగింది. భారీ విజయం వైపు ఆయన దూసుకుపోతున్నారు. ఆయన అనుభవం అవగాహన ఆయనకు కలిసి వస్తుంది..జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు కాలుకు బలపం కట్టుకొని వారి వారి ప్రాంతాల్లో కొణతాల విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు . కాపీ వి క్యాదర్ కార్యకర్తల్లో జోష్ నింపింది డోర్ టు డోర్ ప్రచారాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. బహిరంగ సభలతో ఓటర్ల మనోభావాలను గెలుచుకున్నారు. విపక్షాలు ఆయనకు దరిదాపుల్లో కూడా నిలబడలేరని వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.. అనకాపల్లి వైసీపీ క్యాడర్ గుడివాడ అమర్నాథ్ గెలుపు కోసం గాజువాక లో తిష్ట వేశారు.. ఇ క్కడ వైసిపి అభ్యర్థి గెలుపు కోసం దంతులూరి దిలీప్ కుమార్ మందపాటి జానకిరామరాజు తప్ప పెద్దగా పనిచేస్తున్న వారు ఎవరు కనిపించడం లేదు .రామకృష్ణకు వైసీపీ క్యాడర్తో ఉన్న సంబంధాలు బాగా కలిసి వచ్చాయి .అనేకమంది లోపాయికారిగా రామకృష్ణ కు మద్దతు తెలియజేస్తున్నారు. రామకృష్ణ గెలిస్తే మంత్రి అవుతారని గతంలో వలే అనకాపల్లిని అభివృద్ధి చేస్తారని వాదన జనంలోకి బలంగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆయనకు కలిసి వచ్చాయి.. తెలుగుదేశం పార్టీకి అనకాపల్లి సీటు కేటాయించకపోయినా రామకృష్ణ గెలిస్తేనే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు అనే భావనతో టిడిపి క్యాడర్ విస్తృతంగా పనిచేస్తుంది. అలాగే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన ప్రచారానికి పూనుకుంది .ఎక్కడ ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ పిలుపే లక్ష్యంగా జనసేన కేడర్ యువత రంగంలో దిగి రామకృష్ణ గెలుపుకు పనిచేస్తుంది. మలసాల కుటుంబం పై ఉన్న వ్యతిరేకత జనసేన గెలుపుకు బాటలు వేస్తోంది. సెంటిమెంట్ కలిసొచ్చేలా కొణతాల చేస్తున్న ప్రసంగాలు ఆయనకు అపూర్వమైన మద్దతును కూడగడుతోంది .యువత మహిళలు కూడా రామకృష్ణకు అండగా నిలవడం విశేషం.. జగన్మోహన్ రెడ్డి చరిష్మా అనకాపల్లిలో పనిచేయటం లేదు.. స్థానికంగా టిడిపి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన తనయుడు రత్నాకర్ దాడి జయవీర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగ జగదీష్ బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాజీ అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు తో పాటు కసింకోట మాజీ ఎంపీపీ కొండ్రపు రామునాయుడు ఉగ్గిన రమణమూర్తి గొంతున శ్రీనివాసరావు కాయల మురళి అనకాపల్లి మండలంలో భరత్ బాబు కర్రీ బాబీ గెలుపును భజస్కందాలపై వేసుకుని పనిచేస్తున్నారు పలువురు మాజీ ఎంపీపీలు జడ్పిటిసిలు ప్రస్తుత సర్పంచులు కూడా రామకృష్ణగారు అందిస్తున్నారు దీంతో కొణతాల గెలుపు దాదాపుగా ఖయం గా భావించవచ్చు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…