వినియోగదారుల చట్ట పరిధిలో ఆన్‌లైన్‌ వినియోగదారులు

జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి

అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్‌ వినియోగదారులు కూడా వస్తారని జాయింట్‌ కలక్టర్‌ ఎం.జాహ్నవి పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సం సందర్భంగా మంగళవారం రోటరీ క్లబ్‌ సమావేశం హాలులో ‘వినియోగదారుల రక్షణ చట్టం’పై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈ-కామర్స్‌, ఈ-చెల్లింపులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనైతిక వ్యాపార ధోరణులు, తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన బాధిత వినియోగదారులు ప్రశ్నించేతత్వాన్ని పెంచుకోవాలన్నారు. బాధిత వినియోగదారులు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలోని వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని, నాణ్యత, సేవల్లోని లోపాలు, అక్రమ వ్యాపారాలపై కూడా కమిషన్‌ను సంప్రదించవచ్చని, బాధితులు నేరుగా లేకుంటే వారి ప్రతినిధుల ద్వారా కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు వినియోగదారుల రక్షణ చట్టంలో ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే కొనుగోలు చేసి వస్తువులకు బిల్లు తప్పనిసరిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనల నుంచి రక్షణ కొరకు, వస్తు సేవల్లో మోసపోయిన వినియోగదారులు నేషనల్‌ కన్సూమర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1915, ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1967లను సంప్రదించాలని ఆమె సూచించారు. అ వెబ్‌సెట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని జాయింట్‌ కలక్టర్‌ జాహ్నవి స్పష్టం చేశారు.
వినియోగదారుల కమిషన్ల అధ్యక్షులు జి.తనూజరెడ్డి, జి.వెంకటేశ్వరిలు మాట్లాడుతూ వస్తు నాణ్యత, భద్రతల బాధ్యత తయారీ, ఉత్పత్తి, విక్రయదారులపై విధిగా ఉంటుందన్నారు. కొనుగోలుదారు ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలన్నారు. నగదు చెల్లించి వస్తు సేవల్లో నష్టపోయిన వినియోగదారులకు వినియోగదారుల కమిషన్లు అండగా నిలుస్తాయన్నారు. చాలా మంది వినియోగదారులు అవగాహన లేక కమిషన్‌ను ఆశ్రయించకుండా నష్ట పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రాధాన్యత, కేసు వేయు విధానం, వినియోగదారుల కమిషన్‌లో బాధిత వినియోగదారులు సాధించిన విజయాలను వారు వివరించారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ) కనకమేడల వి.ఎల్‌.నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఔషధ నియంత్ర, పరిపాలన అసిస్టెంట్‌ డైరక్టర్‌ కె.విజయకుమార్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గెజటెడ్‌ ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ కె.సతీష్‌కుమార్‌, లీగల్‌ మెట్రాలజీ పరిశీలకులు డి.భాస్కరరావు, కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బి.త్రినాధరాజు, ఎన్‌.సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సం సందర్భంగా ‘వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్‌ విచారణలు, డిజిటల్‌ సౌలభ్యం’ అంశంపై జరిగిన వ్యాసరచన, డిబేట్‌ పోటీల్లో విజేతలకు జాయింట్‌ కలక్టర్‌ ఎం.జాహ్నవి బహుమతులను అందజేశారు.

sivamanicharan

Share
Published by
sivamanicharan

Recent Posts

ప్రధానమంత్రికి అనకాపల్లి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలకాలి

జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…

4 వారాలు ago

పది రూపాయల నాణేలపై విస్తృత ప్రచారం

ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా  వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…

4 నెలలు ago

ప్రజలకు రక్షణ కల్పించడమే మానవ హక్కుల కౌన్సిల్‌ ధ్యేయం

కౌన్సిల్‌ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్‌ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…

4 నెలలు ago

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…

4 నెలలు ago

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన…చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతిచంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి

అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…

5 నెలలు ago

అస్వ‌స్థ‌త‌కు గురైన‌ పిల్ల‌ల‌కు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం

బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ విజయ క్రిష్ణన్అనకాపల్లి ఆగ‌స్టు 19 : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప‌ట్నం అనాథాశ్రమంలో…

5 నెలలు ago