3.1 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

వైకాపా నిరంకుశ పాలనకు స్వస్తి పలకండి-కోణతాల

సముద్రంలా ఉప్పొంగిన మహిళా గర్జన

మహిళల చేతిలోనే ఏదైనా సాధ్యం…

మహిళా సాధికారత దిశలో కూటమి ప్రభుత్వం…

తాళ్లపాలెం మహిళా గర్జనలో కొణతాల

జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు.ఆదివారం తాళ్లపాలెంలో జరిగిన మహిళా గర్జన సభలో కొణతాల మాట్లాడుతూ. ఈ ఎన్ని కలలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచే యాలన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఛాన్స్ అని కనీసం రాజధాని కూడా నిర్మించలేదని రాజధాని నిర్మించలేని రాష్ట్రం దేశంలో ఉన్నది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. అక్క చెల్లెమ్మలకు మాట ఇస్తున్నాను పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను అన్న జగన్మోహన్ రెడ్డి నిషేధం కాదు కదా తిరిగి తనే బినామీ పేర్లతో సారా కంపెనీలను నడుపుతూ ప్రభుత్వం మద్యం దుకాణాలలో అమ్మకాలు జరుపుతూ కోట్లల్లో వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. అలాగే మీ పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం వచ్చేలా చేస్తానన్న వ్యక్తి ఈరోజు ఒక్కరికి మాత్రమే అమలు చేశాడని ఆ ఒక్కరికి కూడా పూర్తిగా ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం మన అభివృద్ధి దిశలో పయనిస్తామని అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కలగాలంటే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలవాలని సీఎం రమేష్ గెలిస్తేనే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని కేంద్రం నుంచి ఏదైనా పరిశ్రమలు తీసుకురావగలిగిన ఘనత మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి ఉండడంవల్లనే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మన అనకాపల్లి ప్రాంతానికి పంపించడం జరిగిందని కనుక ఎమ్మెల్యే అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles