3.1 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

వైసీపీ నుంచి జనసేన లో చేరికలు

అనకాపల్లి: జిల్లా యాత – శెట్టి బలిజ కులస్తుల ఆధ్వర్యంలో  ఆత్మీయ సమావేశం స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో గల సత్య లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు గురువారం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ తో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ , మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు దాడి రత్నాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాత శెట్టిబలిజ సంఘం సభ్యులు రామకృష్ణ కి వారి వృత్తులలో ఉన్నటువంటి సమస్యలు విన్నవించుకుంటూ మా కులస్తులకు ఒక కమ్యూనిటీ భవనం నిర్మించాలని, సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు..ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బిజేపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ  ఈరోజు కులవృత్తులన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయాయని ఇప్పుడున్న పరిస్థితులు దృశ్య మీ మీ కులవృత్తులను బ్రతికించుకునే అవసరం ఎంతైనా ఉందని అలాగే మీ యొక్క పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని అలాగే మీరు ఏదైతే సమస్యలు తెలియపరిచారు కల్లుగీత కార్మికులకు చెట్లు ఎక్కేందుకు యంత్రాలు ఉన్నాయని అటువంటి యంత్రాలను మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిద్దామని అలాగే నీరా కేఫ్ ప్రాజెక్ట్ మన ప్రాంతంలో అభివృద్ధి చేసుకునేలాగా ప్రయత్నిద్దామని అన్నారు.

సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని మీరు తెలిపిన సమస్యలు రేపు జరగబోవు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  నాయకత్వంలో ప్రభుత్వం కచ్చితంగా కచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని రాష్ట్రానికి నాయకత్వం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ సమస్యలే కాకుండా రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని కచ్చితంగా మేము మీ సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించే దశగా మరొకసారి మీ నాయకులతో చర్చించి కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తానన్న ముఖ్యమంత్రి అన్యాయం చేశాడని  రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని కనుక మన రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకి గాజు గ్లాస్ గుర్తుపై అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.


వైసీపీ నుంచి జనసేన లో చేరికలు

మాకవరం గ్రామం నుంచి సుమారు  మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరి కండువా వేసుకున్నారు ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ వారికి జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చివరిగా ముఖ్య అతిథిగా ఉమ్మడి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ , పీలా గోవింద సత్యనారాయణ , బుద్ధ నాగ జగదీష్ , దాడి రత్నాకర్ కి సంఘం తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు , మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles