2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

శిథిలావస్థకు చేరువలో మునగపాక బ్రిడ్జి

మునగపాక (ఎకెపి న్యూస్) అనకాపల్లి నుండి అచ్చుతాపురం వెళ్లే రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాల రాకపోకలు కారణంగా తరచూ రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయి. ఇటీవలే రోడ్లు మరమ్మతులు చేసినప్పటికీ కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మునగపాక పెద్ద మదుం బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకుంది.ఇదే బ్రిడ్జిపై అధిక లోడుతో వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి.ఈ బ్రిడ్జి పొరపాటున కూలిపోతే పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముందస్తుగా అధికారులు మేల్కొనకపోతే ప్రమాదం తప్పదని చెప్పవచ్చు. అదేవిధంగా  మునగపాక సబ్ స్టేషన్ నుంచి  పెద్ద మదుం వరకు ఉన్నటువంటి రోడ్డు అప్పుడే ఒక వైపు కృంగిపోయింది. ఈ ప్రాంత వాసులు ఈ రోడ్డు మీదుగా భారీ వాహనాల రాకపోకలు నిషేధించాలని కోరుతున్నారు. అనకాపల్లి  బైపాస్ రోడ్ లో నాగులపల్లి వైపుగా ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles