మునగపాక (ఎకెపి న్యూస్) అనకాపల్లి నుండి అచ్చుతాపురం వెళ్లే రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాల రాకపోకలు కారణంగా తరచూ రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయి. ఇటీవలే రోడ్లు మరమ్మతులు చేసినప్పటికీ కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మునగపాక పెద్ద మదుం బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకుంది.ఇదే బ్రిడ్జిపై అధిక లోడుతో వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి.ఈ బ్రిడ్జి పొరపాటున కూలిపోతే పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముందస్తుగా అధికారులు మేల్కొనకపోతే ప్రమాదం తప్పదని చెప్పవచ్చు. అదేవిధంగా మునగపాక సబ్ స్టేషన్ నుంచి పెద్ద మదుం వరకు ఉన్నటువంటి రోడ్డు అప్పుడే ఒక వైపు కృంగిపోయింది. ఈ ప్రాంత వాసులు ఈ రోడ్డు మీదుగా భారీ వాహనాల రాకపోకలు నిషేధించాలని కోరుతున్నారు. అనకాపల్లి బైపాస్ రోడ్ లో నాగులపల్లి వైపుగా ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…