అనకాపల్లి:వెలమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నకు ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్ధి సిఎం రమేష్ ను ఘనంగా సన్మానించారు.సంఘ పెద్దలు బుద్ద భూలోక నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీజేపీ,టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్ధి సి ఎం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అనేక సదుపాయాలు మరియు సంక్షేమ పధకాలు వివరించారు. అలాగే సంఘ పెద్దలు సూచించిన విధంగా తను పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నానన్నారు.మాజీ ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ మాట్లాడుతూ సి ఎం రమేశ్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబందాలు కలిగిన వ్యక్తి కనుక , సిఎం రమేశ్ గెలుపుతో అనకాపల్లి మరింత అభివృద్దికి దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్,ఈర్నే శ్రీరామమూర్తి, పరమేశ్వరావు,కొనతాల చంద్రశేఖర్,బొల్లెం కుసరాజు,పిట్టలరాజు,దాడి రామారావు,నాయుడు,చంద్రవాణి,మళ్లా ప్రసాదు,శ్రీనివాసరావు,దాడి బుజ్జి,కర్రి సుబ్రమణ్యం ,దనుంజయనాయుడు,జగదీశ్,జగన్మోహన్,మురళి,పీలా హరి,కోరిబిల్లిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.