2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

సీఎం రమేష్ మనుషులను అనకాపల్లి నుంచి ఖాళీ చేయించాలి- సిపీఎం

అనకాపల్లి:పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రమేష్ తన మనుషులను వేలాది మందిని తీసుకొచ్చి విజయ రెసిడెన్సీ, ఇతర ప్రైవేటు హోటల్స్, హైవేలో ఒక ప్రయివేట్ బంగ్లాలో అదేవిధంగా వివిధ మండలాల్లో ప్రత్యేకమైన ఇళ్ళను, హోటల్స్ ను అద్దెకు తీసుకొని ఉంచడం జరిగిందని సిపిఎం నేతలు వెల్లడించారు. వారందరినీ వెంటనే ఖాళీ చేయించి జిల్లా బయటికి పంపించాలని సిపిఎం పార్టీ అనకాపల్లి మండలం కమిటీ కన్వీనర్ గంటా శ్రీరామ్, సభ్యులు కాళ్ళ తేలయ్యబాబు,బోప్పే ఉమామహేశ్వరరావులు డిమాండ్ చేశారు. అప్పుడే అనకాపల్లి జిల్లాలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. వారి మనుషులు ఇక్కడ ఉన్నట్లయితే ఎన్నికల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు, పోలీసులు వెంటనే వారిపై తగు చర్యలు తీసుకొని జిల్లాలో శాంతిభద్రతలు విఘాతం కలగకుండా చూడాలని కోరారు . ఇప్పటికే అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలో ఉన్న బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని కోరారు.పది సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుకి కనీసమైన నిధులు ఇవ్వకుండా అనేక ఆటంకాలు కలిగిస్తూ పోలవరం ప్రాజెక్టును జాప్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే రెండు సంవత్సరాల పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాయమాటలు చెబుతుందని అన్నారు. ఈ ప్రాంతంపై కనీస అవగాహనలేని సీఎం రమేష్ తనను గెలిపిస్తే ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు, కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవ చేశారు. పది సంవత్సరాలు రాష్ట్రలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్ ఈ ప్రాంతం గురించి ఒక సారి కూడా ఆలోచించలేదని పార్లమెంట్ల్ లో స్టీల్ ప్లాంట్ గురించి గానీ, విశాఖ రైల్వే జోన్ గురించి గానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి నిధులు ఇవ్వాలని, రాష్ట్ర నికి స్పెషల్ స్టేటస్ అమలు చేయాలని, విభజన ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీల్లో ఏ ఒకటి అమలు కాకపోయినా ఏనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క ప్రయత్నం చేయని సిఎం రమేష్ తన యొక్క స్వలాభం కోసం మాత్రమే తెలుగుదేశం నుంచి బిజెపిలోకి చేరారన్నారు. రేపు కేంద్రంలో పార్టీ మారితే ఖచ్చితంగా సీఎం రమేష్ ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదన్నారు. తన సొంత లాభం పొందడం కోసం అధికార పార్టీల వెంట వెంపర్లాడటం  సీఎం రమేష్ తన సొంత మనసులను తయారు చేసుకొని ఈ ప్రాంతాన్ని దోచుకోవాలని ఆలోచిస్తూ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు. అలాంటి సీఎం రమేష్ ని ఓడించడం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles