విశాఖపట్నం:తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్కి చేసిన ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారు. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖలో ఉన్నారని, వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారించే తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని, ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…