2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

సోషల్ మీడియా పై పోలీస్ నిఘా…

విశాఖపట్నం:సోషల్‌ మీడియ వేదికగా ఎవరెవరిపైనే ఏవేవో తప్పుడు పోస్టింగులు రావడం సహజమే. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అలాంటి ఫేక్‌ న్యూస్‌పై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందు కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసింది. ఎన్నికల వేళ ముఖ్యంగా రాజకీయ పార్టీల వారు ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారాలను పదే పదే ట్రోల్‌ చేసి ఆయా పార్టీల్లో వర్గ విభేదాలు, తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తదనుగుణంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా పోలీసు శాఖ ఇలాంటి ఫేక్‌ న్యూస్‌పై జల్లెడ పడుతోంది. ఈ విషయంలో జిల్లా ప్రజలను, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు ఓ వాట్సప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసి ఓ ప్రత్యేక నెంబరు కేటాయించింది. సైబర్‌ క్రైమ్‌ విభాగంతో కలిసి పనిచేసే ఆ వాట్సప్‌ నెంబరుకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు రంగంలోకి దిగి బాధ్యులను గుర్తించి చర్యలు చేపడతారు.

తప్పుడు ట్రోల్‌పై వాట్సాప్‌ చేయండి

సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ట్రోల్‌ చేస్తున్నప్పుడు సామాజిక స్పృహ కలిగిన ప్రజలు ఈ విషయాన్ని తక్షణమే జిల్లా పోలీసు శాఖ నిర్దేశించిన ‘8143579125’ అనే ఫోన్‌ నెంబరుకు వాట్సప్‌ చేయాలి. దీని కోసం జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్‌ ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటుచేసి వాట్సప్‌ నెంబరును అమలులోకి తీసుకువచ్చారు. ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీల్లోని కొన్ని సామాజిక వర్గాల నడుమ, లేదా వ్యక్తుల మధ్య ఘర్షణ పూరిత వాతావారణాన్ని రెచ్చగొట్టేలా ఈ తప్పుడు సమాచారం ట్రోల్‌ అవుతున్నా, వైరల్‌ అవుతున్నా ప్రజల్లో ఎవరైనా పోలీసు వాట్సప్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేసిన వారి పేర్లు, చిరునామాను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచుతారు.

తొలి చర్యలు అడ్మిన్లపైనే

ఏవైనా సోషల్‌ మీడియా గ్రూపులో ఈ తరహా తప్పుడు సమాచారం ట్రోల్‌ అవుతూ విస్తృత ప్రచారం చేస్తుంటే పోలీసులు తొలుత ఆ గ్రూపు అడ్మిన్‌నే బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటారు. తర్వాత లోతైన దర్యాప్తుతో ఈ తప్పుడు పోస్ట్‌ ఎవరు చేశారని సాంకేతికంగా ఆరా తీసి గుర్తిస్తారు. అప్పుడు వారిపై చర్యలకు ఉపక్రమిస్తారు. వాట్సప్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో తప్పుడు వార్తలు, అవాస్తవాల ప్రచారం, బెదిరింపులకు పాల్పడితే అడ్మిన్లు బాధ్యులు అవుతారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖ దీనిపై వాట్సప్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది.

ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోషల్‌ మీడియా అడ్మిన్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గ్రూపు అడ్మిన్లు, సభ్యులు పోలీసు ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. జిల్లాలో సోషల్‌ మీడియా గ్రూపులన్నింటినీ గుర్తించి వాటిపై నిరంతర నిఘా పెట్టాం. ఎక్కడైనా, ఎప్పుడైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మీద తప్పుడు సమాచారం ట్రోల్‌ అవుతుంటే ప్రజలు గమనించి పోలీసులు ఇచ్చిన వాట్సాప్‌ నెంబరుకు పోస్ట్‌ చేయండి. మీ సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతాం. చైతన్యంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో విజ్ఞులైన ప్రజలుగా మీరూ భాగస్వామ్యులు అవుతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles