అనకాపల్లి:సోమవారం నుండి 6 7 8 తేదీలలో జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో అర్హులందరూ పాల్గొనాలని అనకాపల్లి ఆర్ఓ జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి పిలుపునిచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించిన పోలింగ్ పర్సనల్ అత్యవసర సర్వీసుల వారికి పోస్టల్ బాలెట్ ఓటింగ్ నిర్వహించుటకు జి.వి.ఎం.సి. బాలుర హై స్కూల్,28 వార్డు గవరపాలెం (చిన్న హై స్కూల్) లో సౌకర్య కేంద్రం ఏర్పాటు చేయబడిందని ఆమె తెలిపారు. ఈ బ్యాలెట్ ఓటింగ్ 6 7 8 తేదీలలో ఉదయం 7గం.ల నుండి సాయంత్రం గం.6ల వరకు మూడు రోజులు పాటు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు వ్యవసాయ సర్వీసుల ఉద్యోగులు వినియోగించుకో వలసిందిగా ఆమె కోరారు. జెసి వెంట కసింకోట తాసిల్దార్ మధుసూధన తదితరులు పాల్గొన్నారు.
ఒత్తిడికి గురికాకుండా ఎన్నికల విధులు
జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి
అనకాపల్లి, మే 5: ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి అధికారులు, ఉద్యోగులకు ఉద్బోదించారు. ఆదివారం జిల్లాలో ఎలమంచిలి, పాయకరావుపేట, నక్కపల్లిలలో జరుగుతున్న పోలింగ్ అధికారుల శిక్షణా తరగతులలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ పట్ల క్షుణ్ణమైన అవగాహన కలిగించుకోవాలన్నారు. మాన్యువల్ ప్రకారం ప్రతీ అంశాన్ని గుర్తించి తగిన విధంగా పోలింగ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే సమయంలో, పోలింగ్ తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని ఆప్రకారం చేయాన్నారు. ఎటువంటి తడబాటు లేకుండా పై అధికారుల ఆదేశాలననుసరిస్తూ పూర్తి చేయాలన్నారు. క్రమశిక్షణతో విధి నిర్వహణ చేయాలని, ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా సానుకూల దృక్ఫథతో ఉండాలన్నారు. అంతకు ముందు అనకాపల్లి గవరపాలెం హైస్కూల్ లో పోస్టల్ బ్యాలట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించారు. ఎలమంచిలి, నక్కపల్లి డిగ్రీకళాశాలలో వున్న స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎం ల కమిషనరింగ్ నక్కపల్లిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్ ఫెసిలిటేషన్ సెంటర్ లను పరిశీలించారు. ఈ పర్యటనలో అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల ఆర్వోలు, ఎఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
జారీ పౌర సంబంధాల అధికారి, అనాపల్లి
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…