భరత్ కుమార్ కు అడుగడుగున మహిళలు నీరాజనాలు
83, 84 వ వార్డు లో భరత్ కుమార్ విస్తృత ప్రచారం
అనకాపల్లి మే 5:- అనకాపల్లి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ చేపడుతున్న ప్రచారంలో అడుగడుగునా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 83 వ వార్డు ఇంచార్జ్ జాజుల రమేష్,84 వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది గొల్ల వీధి మొదలుకొని కరణాల వీధి, బొగ్గరపు వీధి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార స్థలానికి చేరుకోగానే మహిళలు, స్థానిక నాయకులు భరత్ కు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా భరత్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. గడప గడపలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి భరత్ కు హరతులు పట్టారు. మార్గ మధ్యలో ప్రజలను పలకరిస్తూ వారి యోగ క్షేమాలని అడిగి తెలుసుకుని తనను దీవించాలని భరత్ విజ్ఞప్తి చేశారు. విద్యావంతుడైన తనను దీవించి ఎమ్మెల్యేగా చేస్తే అనకాపల్లిని అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కారిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి చేయలేదని తెలిపారు.ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, జగన్మోహన్ రెడ్డి ని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని
కోరారు. అప్పుడే రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షులు మందపాటిజానకిరామరాజు,డాక్టర్ రామ్మూర్తి, జాజుల రమేష్, అప్పికొండ రవిశంకర్, కోరుకొండ అప్పల సూరి, కోరుకొండ మునిస్వామి,గాడి మాదురినాయుడు, కేతిరెడ్డి ప్రసాద్, కొణతాల సత్తిబాబు,సేనపతి సాయి జైట్టి వాసు, మమ్మిడి లక్ష్మీపతి,బీ. ఈశ్వరరావు, కొణతాల సత్తిబాబు, కొట్ని శ్రీనివాస్,పిల్లల శివ అప్పారావు, సూరిశెట్టి వికాస్, యల్లపు గోవిందు, యండ్ర శ్రీనివాసరావు,బాబు హరినాథ్, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…