- నాభూతో..నా భవిష్యత్ లా.. అంబరాన్నంటిన సంబరాలు ఉప్పెనలా ఉప్పొంగిన ఉత్సాహం – సునామీలా కమ్మేసిన కార్యకర్తల సైన్యం..
- జై జగన్, జై భరత్ నినాదాలతో దద్దరిల్లిన అనకాపల్లి మలసాలకు ఎదురులేదు…
- అనకాపల్లిలో వైసీపీకి తిరుగులేదంటూ చెప్పిన ప్రజలు అనకాపల్లి చరిత్ర లో కని వినని రీతిలో నామినేషన్ కార్యక్రమం
- మండుటెండను సైతం లెక్కచేయని ప్రజలు
- వేలాది గా పోట్టేత్తిన జన సందోహం
- జనసముద్రం గా మారిన అనకాపల్లి పట్టణం
అనకాపల్లి: నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ నామినేషన్ విజయోత్సవ ర్యాలీ ని మరపించిన రీతిలో అంబరాన్నంటిన సంబరాలు మధ్య అనకాపల్లి చరిత్ర లో కని వినని రీతిలో నాభూతో నా భవిష్యత్ అన్న విధంగా మలసాల భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమం జరిగింది.సర్వమత ప్రార్ధనలు, ప్రత్యేక పూజలు అనంతరం నామినేషన్ ఘట్టానికి అంకుకురార్పణ జరిగింది.. అసంఖ్యాక ప్రజలు, వైయస్ ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ అనకాపల్లి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ముందుకు సాగారు. భారీ జనసందోహంతో అనకాపల్లి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి పట్టణంలోని స్థానిక రింగ్ రోడ్డు లో పార్టీకార్యాలయం నుండి ఆర్. ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేసారు. నిప్పులు చెరిగే ఎండని సైతం లెక్క చేయక వైయస్ఆర్సీపీ శ్రేణులు.. భారీ జనసందోహంతో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా ఖ్యాతికెక్కిన మలసాల భరత్ కుమార్ నామినేషన్, జై జగన్, జై భరత్ నినాదాలతో దద్దరిల్లిన అనకాపల్లి దారి పొడవునా ప్రజల అఖండ స్వాగతాలు, అంచనాలను మించి రికార్డు స్థాయిలో ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు. ఒక్కసారి గా అనకాపల్లి హెూరెత్తింది. జై జై భరత్ నినాదాలతో మార్మోగింది. కిలోమీటర్ల పొడవునా జనంతో రహదారులు కిక్కిరిసాయి. అడుగడుగునా సీఎం జగన్ ఎమ్మెల్యే భరత్ అంటూ నినాదాలతో హెూరెత్తించారు. అనకాపల్లిలో లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ ఘట్టం అట్టహాసంగా ముగిసింది. ఉదయం నుంచే రహదారులన్నీ వైసీపీ అభిమానులతో నిండిపోయాయి. భరత్ కు మద్దతుగా ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేశారు. ఎన్నికల కార్యాలయం వరకు జరిగిన ర్యాలీ విజయవంతంగా సాగింది. వేలాది మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ ను ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎంపీ అభ్యర్థి బూడిముత్యాల నాయుడు, ఏపిఐ డబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ సమక్షంలో భరత్ కుమార్ నామినేషన్ వేశారు. పార్టీ క్యాడర్ అందరూ తమ వంతు జన సమీకరణకు కృషి చేశారు. ఆద్యంతం నామినేషన్ పర్వం పండగలా జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండను కూడా లెక్క చేయకుండా వేలాది మంది అభిమానులు నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నుకొని, రాబోయే ఐదేళ్ల కాలానికే కాదు, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించిన ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆనందోత్సవాల మధ్య ఆయన మాట్లాడుతూ మీ అందరి అభిమానం మర్చిపోలేనిధని అనకాపల్లి అభివృద్ధికి నిరంతరము కృషి చేస్తానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మందపాటి జానకి రామరాజు, మలసాల కిషోర్, కొణతాల మురళి, పలకా రని, జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.